Last Updated on by
ఇండస్ట్రీలో ఇది చాలా కామన్. లైన్ వేయడం అంటే నిజంగా కాదు.. సినిమాలో ఆఫర్ ఇవ్వడం అని అర్థం. అన్నయ్య ఆఫర్ ఇస్తే.. తమ్ముడు పిలిచి అవకాశం ఇవ్వడం ఇక్కడ కామన్. అదే తమ్ముడు సినిమాలో హీరోయిన్ తో అన్నయ్య రొమాన్స్ చేయడం కూడా కామనే. మెగా కుటుంబంలోనే ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు అక్కినేని బ్రదర్స్ కూడా ఇదే చేస్తున్నారు. ఇన్నాళ్లూ నాగచైతన్యకు పోటీగా అఖిల్ రాలేదు. కానీ ఆ టైమ్ కూడా వచ్చేసింది. నాగచైతన్య హీరోయిన్ లతో నటించడానికి అఖిల్ కు వయసు సరిపోదు. కానీ ఇప్పుడు అన్నయ్య హీరోయిన్ పై కన్నేస్తున్నాడు ఈ సిసింద్రి.అఖిల్ ప్రస్తుతం వెంకీ అట్లూరి సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని చూసాడు వెంకీ. కానీ కొత్త హీరోయిన్లు అఖిల్ కు కలిసిరావడం లేదు. దాంతో ఆ సెంటిమెంట్ కి భయపడి ఇప్పుడు నిధి అగర్వాల్ వైపు అడుగేస్తున్నారు. ఈమె ప్రస్తుతం నాగచైతన్యతో సవ్యసాచిలో నటిస్తుంది. అఖిల్ కు నిధి పర్ ఫెక్ట్ గా సెట్ అవుతుందని భావిస్తున్నాడు వెంకీ. అందుకే ఈ భామనే తన హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నాడు. ఇదే జరిగితే తొలిసారి అన్నయ్య హీరోయిన్ తో తమ్ముడు జోడీ కట్టినట్టవుతుంది. మొత్తానికి అక్కినేని బ్రదర్స్ కూడా ఎక్స్ చేంజింగ్ ఆఫర్ మొదలుపెట్టేసారు.
User Comments