అసలాట ఇప్పుడే మొద‌లైంది అఖిల్

అక్కినేని వార‌సుడు ఇండ‌స్ట్రీకి వ‌చ్చి అప్పుడే మూడేళ్లైపోయింది. అఖిల్ తో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన సిసింద్రీ.. హ‌లోతో గ‌తేడాది చివ‌ర్లో ప‌ల‌క‌రించాడు. కానీ ఈ రెండు సినిమాలు ఫ్లాపులే. కాక‌పోతే హ‌లో కాస్త బెట‌ర్. ఈ చిత్రం డ‌బ్బు ప‌ట్టుకెళ్లిపోయినా పేరు తీసుకొచ్చింది. అందుకే మ‌రోసారి ప్యూర్ ప్రేమ్ క‌హానీ చేస్తున్నాడు అఖిల్. తొలిప్రేమ లాంటి క్లాస్ ల‌వ్ స్టోరీ చేసిన వెంకీ అట్లూరి చెప్పిన క‌థ న‌చ్చి ఆయ‌న‌తో సినిమాకు సై అంటున్నాడు అఖిల్. ఈ చిత్రానికి ముహూర్తం పెట్టి కూడా చాలా రోజులైంది. ఇప్పుడు మే 29 నుంచి లండ‌న్ లో షూటింగ్ మొద‌లు పెట్ట‌బోతున్నారు టీం. ఇది కూడా పూర్తిస్థాయి ప్రేమ క‌థే అని తెలుస్తుంది.

ఇందులో స‌వ్య‌సాచి ఫేమ్ నిధి అగ‌ర్వాల్ ను హీరోయిన్ గా తీసుకునే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. దాంతోపాటే వ‌ర్మ‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు అఖిల్. ఇది ఉండ‌దేమో అనే వార్త‌లొచ్చినా.. వ‌ర్మ మాత్రం నాగార్జున ఇంట‌ర్వ్యూలోనే ఉంటుంద‌ని క్లారిటీ ఇచ్చాడు. ఇంక అంత‌కంటే క‌న్ఫ‌ర్మేష‌న్ ఇంకేం కావాలి..? అఖిల్ ను కాలేజ్ స్టూడెంట్ గా చూపించ‌బోతున్నాడు వ‌ర్మ‌. శివ త‌ర‌హా క‌థ‌తో ఆయ‌న్ని ప్ర‌జెంట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. ముందు అఖిల్ సినిమా వ‌ర్క‌వుట్ అవ్వాలంటే ఆఫీస‌ర్ హిట్ అవ్వాలి. లేదంటే ఖచ్చితంగా వ‌ర్మ చేతుల్లోంచి అఖిల్ ను బ‌య‌టికి తీసుకొస్తాడు నాగ్. ఏదేమైనా కెరీర్ మొద‌లుపెట్టిన మూడేళ్ల‌ త‌ర్వాత కానీ ఫుల్ బిజీ కావ‌ట్లేదు అఖిల్.

User Comments