అఖిల్ కు ఎన్టీఆర్ తో పోటీ అవ‌స‌ర‌మా..?

Last Updated on by

అస‌లే రెండు ఫ్లాపుల‌తో డీలా ప‌డిపోయి అఖిల్ కెరీర్ దారుణంగా ఉందిప్పుడు. తొలి సినిమా అఖిల్ ఫ్లాప్ అయినా కూడా పెద్ద‌గా ఫీల్ కాలేదు కానీ హ‌లో ప్లాప్ అయ్యేస‌రికి మాత్రం ఈ కుర్రాడు బాగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే టాక్ పాజిటివ్ గా వ‌చ్చినా కూడా అప్పుడు ఎంసిఏ దెబ్బ‌కు చ‌తికిల ప‌డింది ఈ చిత్రం. అయితే హ‌లో ఫ్లాప్ అయినా ఎలాంటి సినిమా చేయాలో అఖిల్ కు ఓ క్లారిటీ అయితే వ‌చ్చింది. అందుకే ఇప్పుడు మ‌రోసారి ప్రేమ క‌థ‌నే ఎంచుకున్నాడు ఈ హీరో. ఈ చిత్రం ద‌సరా ల‌క్ష్యంగా వ‌స్తున్నాడు అక్కినేని కుర్రాడు. అస‌లే ఓ సారి పోటీకి దిగి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకున్నాడు ఈ హీరో. అది తెలిసి కూడా మ‌రోసారి పోటీకి సై అంటున్నాడు.

ద‌సరాకు ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ సినిమా రానుంది. అర‌వింద స‌మేత‌పై అంచ‌నాలు ఎలా ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అజ్ఞాత‌వాసి ఫ్లాప్ అయినా కూడా ఈ సినిమాపై అంచ‌నాలు మ‌రో రేంజ్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఇప్పుడు అఖిల్ పోటీకి దిగుతుండ‌టం మాత్రం అంత ఈజీ కాదు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌నేది అఖిల్ ప్లాన్. వెంకీ అట్లూరి కూడా అదే ప్లానింగ్ తో ఉన్నాడు ఇప్పుడు. సినిమా చేస్తున్న టైమ్ లో ద‌ర్శ‌కుడే త‌న గాళ్ ప్రెండ్ అని.. ప్ర‌స్తుతం త‌న గాళ్ ఫ్రెండ్ పేరు వెంకీ అట్లూరి అని చెబుతున్నాడు అఖిల్. మ‌రి.. కోరికోరి ఎన్టీఆర్ తో పెట్టుకుంటున్నాడు అఖిల్. ఏం జ‌ర‌గ‌బోతుందో ఏమో మ‌రి..?

User Comments