ప్లేబోయ్ ల‌వ‌ర్ బోయ్‌ అయితే! – అఖిల్‌

అఖిల్, హ‌లో చిత్రాల‌తో న‌టుడిగా ప్ర‌శంస‌లు అందుకున్నాడు అఖిల్. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా న‌టుడిగా, డ్యాన్స‌ర్ గా నిరూపించుకున్నాడని క్రిటిక్స్ మెప్పు ద‌క్కింది. తాజాగా అఖిల్ న‌టిస్తున్న మూడ‌వ సినిమా మిస్ట‌ర్ మ‌జ్నుపై అభిమానులు స‌హా ఆడియెన్ లో ఆస‌క్తి నెల‌కొంది. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా న‌టించిన మిస్టర్ మజ్ను ఈనెల‌ 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది. హైద‌రాబాద్ మీడియాతో అఖిల్ చిట్ చాట్ ఇది..

ఇదో ఛాలెంజ్:
నాకు ఈ కథ వినగానే .. అందులో నా పాత్ర చిత్ర‌ణ న‌చ్చింది. ఒక క్యారెక్టర్ బేస్డ్ సినిమా ఇది. ప్లేబోయ్ ల‌వ‌ర్ గా మారితే ఎలా ఉంటుంది? అన్న‌దే క‌థ‌. ఆ పాత్ర చిత్ర‌ణ‌ నాకు చాలా ఆస‌క్తిగా ఛాలెంజింగ్ గా అనిపించింది. నేను ఇంతకుముందు చేసిన రెండు సినిమాలకి ఇది పూర్తిగా అపోజిట్ చిత్రం. సినిమాలో మంచి వినోదంతో పాటు మంచి ఎమోషన్ ఆక‌ట్టుకుంటుంది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను.

వెంకీ ట్యాలెంటెడ్:
వెంకీ ప్ర‌తిభ‌ ఉన్న ద‌ర్శ‌కుడు. త‌న‌లో మంచి రైటర్ ఉన్నాడు. వెంకీ డాడీకి పెద్ద అభిమాని. నాన్న‌గారు న‌టించిన నిన్నే పెళ్లాడతా, మన్మధుడు చిత్రాల‌ ప్రేరణతోనే ఈ సినిమా చేశాడు. త్రివిక్ర‌మ్ క‌థ‌లు, ద‌ర్శ‌క‌త్వ శైలికి సంబంధించిన‌ స్ఫూర్తి త‌న‌కు ఉంది.

ప‌దేళ్లుగా తెలుసు:
వెంకీ నాకు ప‌దేళ్లుగా తెలుసు. కాకపోతే బెస్ట్ ఫ్రెండ్ ఏమీ కాదు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా చాలా సార్లు కలిసాం. కానీ మా మధ్య క్లోజ్ నెస్ అయితే లేదు. మజ్ను దగ్గర నుంచే తను నాకు స‌న్నిహితుడు అయ్యాడు.

వేగం స్క్రిప్టులో క్లారిటీ వ‌ల్ల‌నే:
అలా ఏం లేదు. హ‌లోకి స్క్రిప్ట్ విషయంలో చాలా ఎక్కువ స‌మ‌యం తీసుకున్నాం. అలాగే ఆ సినిమాకి చాలా ఎక్కువ రోజులు అవ‌స‌రం అయ్యింది. అఖిల్ కి కూడా అలాగే జరిగింది. కానీ ‘మిస్టర్ మజ్ను’ ఫుల్ స్క్రిప్ట్ తో వెంకీ రెడీగా ఉండటం వల్ల ఈ సినిమా కొంచెం స్పీడ్ గా అయింది.

మిస్ట‌ర్ అందుకే:
మిస్టర్ అని పెట్టడానికి ప్రత్యేకమైన కారణాలు అయితే ఏమి లేవు. కాకపోతే ఓన్లీ మజ్ను అని పెడితే కొంచెం ఎక్కడో ట్రాజడీ ఫీలింగ్ ఉంటుందేమో అని, వెంకీ మజ్నుకి ముందు మిస్టర్ అని పెట్టాడు. అలాగే మిస్టర్ పెట్టడం వల్ల, సినిమాలోతను ఒక మోడ్రన్ మజ్నును చూపించబోతున్నాడనే సెన్స్ ను కూడా హైలెట్ చెయ్యొచ్చు అనే ఆలోచనతో వెంకీ అలా టైటిల్ పెట్టడం జరిగింది. ఓవరాల్ గా మజ్ను అనే టైటిల్ బాగా కలిసొచ్చింది మా ఫ్యామిలీకి.

ప్రేమ‌క‌థ‌లో యాక్షన్ ప్రాముఖ్య‌త:
యాక్షన్ పార్ట్ కూడా ఉంటుంది. మూడు ఫైట్స్ ఉన్నాయి. నాకూ, నా బాబాయ్ – పిన్నికి మధ్య వచ్చే ట్రాక్ కూడా చాలా బాగుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో అన్ని రకాలు ఎమోషన్స్ ఉంటాయి.

మాస్ .. నాన్న‌గారినే అడగాలి:
అవును.. మాస్ నేర్చుకోమన్నారు. అదే ఎలా నేర్చుకోవాలో తెలియట్లేదు. ఇక ఎలా నేర్చుకోవాలి అని నాన్నగారినే అడగాలి. జనరల్ గా బయట తారక్ నాకు కాంప్లిమెంట్స్ ఇవ్వడు. కానీ ఆడియో ఈవెంట్ లో నా గురించి మాట్లాడుతూ చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.

ఎస్.ఎస్.థ‌మ‌న్ గుడ్‌:
ఒక ప్రేమ‌క‌థ‌కు మ్యూజిక్ ఏంత ముఖ్య‌మో అందరికి తెలుసు. తమన్ మ్యూజిక్ మజ్నును మరో లెవల్ కి తీసుకువెళ్తుంది.

మ‌ల్టీస్టార‌ర్:

మ‌ల్టీస్టార‌ర్ ఆస‌క్తి ఉంది చేస్తాను. గతంలోనే ఓ మల్టీస్టారర్ చెయ్యమని అడిగారు. కానీ అప్పుడు చెయ్యటం కరెక్ట్ కాదు అని చెయ్యలేదు. కథ నచ్చితే మాత్రం చేస్తాను. ఎక్స్ ప్యాండ‌బుల్స్ లాంటి సినిమా చేయాలి.

తదుపరి ప్రాజెక్టులు:
ప్రస్తుతం నా దృష్టి అంతా పూర్తిగా మిస్టర్ మజ్ను పైనే ఉంది. ఈ సినిమా విడుదలైన తరువాతే నా తదుపరి చిత్రం గురించి ప్రకటిస్తాను. ఫిబ్ర‌వ‌రిలో ఓ రెండు సినిమాల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న ఉంటుంది.