ఆ డైరెక్ట‌ర్ ని అఖిల్ లాక్ చేసాడా

అక్కినేని వార‌సుడు అఖిల్ స‌క్సెస్ కోసం పోరాటం చేస్తున్నాడు. తొలి మూడు సినిమాలు డిజాస్ట‌ర్లు. నాల్గ‌వ సినిమాతోనైనా హిట్టు కొట్టాల‌ని క‌సితో ప‌నిచేస్తున్నాడు. ప్ర‌స్తుతం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. శ‌ర వేగంగా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతోంది. ఇందులో హీరోయిన్ ఎవ‌రు? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? వంటి వివ‌రాలు ఇంకా వెల్ల‌డించ‌లేదు. తాజాగా అఖిల్ ఈ సినిమాతో సంబంధం లేకుండా మ‌రో ప్రాజెక్ట్ ను లైన్ లో పెడుతున్నాడు.

కొన్ని నెల‌ల క్రితం గీత‌గోవిందం డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ క‌థ వినిపించిన‌ట్లు ప్ర‌చారం సాగింది. కానీ వాస్త‌వాలు బ‌య‌ట‌కు రాలేదు. తాజాగా ఆ కాంబినేష‌న్ నిజ‌మేన‌ని అఖిల్ స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా తెలిసింది. ఇటీవ‌లే ప‌రుశురాం మ‌రోసారి క‌థ వినిపించి లాక్ చేసిన‌ట్లు చెబుతున్నారు. భాస్క‌ర్ సినిమా తర్వాత ఇదే ఉంటుంద‌ని తెలిసింది. అయితే మ‌హేష్ తో కూడా క‌మిట్ ఉంటుంది. కానీ మ‌హేష్ ను మెప్పించే లోపు అఖిల్ తో సినిమా పూర్తిచేయ‌వ‌చ్చ‌ని భావించి ప‌ర‌శురాం ఈ ప్రాజెక్ట్ నే మూవ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.