ఎన్టీఆర్ తర్వాత అఖిల్, నాని అంటున్నారే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ జై లవ కుశ తో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోన్న విషయం తెలిసిందే. జై క్యారెక్టర్ తో నటనలో మరోసారి తారక్ పీక్స్ కు వెళ్లిపోయాడనే టాక్ రావడంతో.. థియేటర్స్ దగ్గర బాగానే సందడి కనిపిస్తుంది. మరోవైపు, హోస్ట్ గా తను నిర్వహిస్తోన్న బిగ్ బాస్ రియాలిటీ షో కూడా చివరి దశకు వచ్చేయడంతో.. బుల్లితెరపై కూడా ఎన్టీఆర్ హంగామా ఓ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు మొత్తానికి ఇటు సినిమా, అటు బిగ్ బాస్ ను ఎన్టీఆర్ ఫినిష్ చేసేయడంతో.. కొన్నిరోజుల పాటు ఫ్యామిలీతో కలిసి రిలాక్స్ అవ్వడానికే ఫిక్స్ అయిపోయాడు.
దీంతో సినిమా పరంగా త్రివిక్రమ్ రూపంలో ఎన్టీఆర్ కు ఓ క్లారిటీ ఉన్నా.. నెక్స్ట్ బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 2 కు హోస్ట్ గా చేస్తాడా? లేదా? అనే దానిపై మాత్రం క్లారిటీ లేకపోవడం పలు డిస్కషన్స్ కు దారితీస్తుంది. అందుకే ఇప్పుడు వచ్చే సీజన్ కు కూడా ఎన్టీఆర్ ఇంట్రెస్ట్ చూపిస్తే.. తన తోనే హోస్ట్ చేయించే ప్లానింగ్ తో స్టార్ గ్రూప్ ఉన్నట్లు సమాచారం బయటకు వచ్చింది. మరి ఎన్టీఆర్ సెకండ్ సీజన్ కు ఏదో కారణంతో నో చెబితే.. అప్పుడేంటి అనేదే ఇప్పుడు అందరి ప్రశ్న. దానికి కూడా ఇప్పుడు స్టార్ గ్రూప్ ఓ సమాధానాన్ని సిద్ధం చేసినట్లే తెలుస్తోంది. అదేంటంటే, ఎన్టీఆర్ సెకండ్ సీజన్ కు ఒప్పుకోకపోతే.. తన స్థానంలోకి ఓ ఇద్దరు యంగ్ హీరోలను తెచ్చే పనిలో షో నిర్వాహకులు పడ్డారట.
అందులోనూ ఇకపై వచ్చే సీజన్స్ లలో బిగ్ బాస్ హౌస్ లో మన సెలబ్రిటీలతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉందని టాక్ ఉన్న నేపథ్యంలో.. ఈసారి ఎన్టీఆర్ లాంటి బడా హీరో కాకుండా మీడియం రేంజ్ హీరోలైతే బాగుంటుందని షో నిర్వాహకులు లెక్కలు వేసుకుంటున్నారట. ఆ లెక్కల ఫలితమే ఇప్పుడు ఓ యంగ్ టాలెంటెడ్ హీరో, ఓ కుర్ర హీరో పేర్లు బయటకు వచ్చేలా చేసేయని ఇన్నర్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ యంగ్ హీరోలు మరెవరో కాదు.. తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేస్తూ స్టార్ హీరోగా ఎదిగిన నాని, అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ సంచలనం అఖిల్. ఈ ఇద్దరూ కూడా క్రేజీ స్టార్సే కావడం ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఇంట్రెస్టింగ్ గా మార్చేసింది. అదీకాకుండా ముందుగా అఖిల్ తోనే ఓ సీజన్ ను హోస్ట్ చేయించి.. ఆ తర్వాత నాని ని తీసుకొచ్చేలా పావులు కదుపుతున్నారని తెలియడం హాట్ టాపిక్ అనే అనాలి. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో తెలియదు గాని, ఎన్టీఆర్ తర్వాత అఖిల్, నాని అంటే మాత్రం.. బిగ్ బాస్ కు తెలుగు బుల్లితెరపై తిరుగులేనట్టే.