స‌యేషా అక్క‌డ‌.. అఖిల్ ఇక్క‌డే..!

Last Updated on by

అందుకే అనేది ఇండ‌స్ట్రీ అనేది వైకుంఠపాళి అని. ఇక్క‌డ ఎవ‌రు ఎప్పుడు నిచ్చెన‌లు ఎక్కుతారో.. ఎవ‌రు ఎప్పుడు పాము నోట్లో ప‌డ‌తారో ఎవ‌రికీ తెలియ‌దు. ఇదే సూత్రం ఇప్పుడు అఖిల్.. స‌యేషా సైగ‌ల్ విష‌యంలో జ‌రుగుతుంది. స్టార్ బ్యాగ్రౌండ్.. కావాల్సినంత స‌పోర్ట్.. స్టార్ డైరెక్ట‌ర్ అండ దండ‌లు ఉండి కూడా అఖిల్ కెరీర్ మూడేళ్లుగా ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే అన్న‌ట్లుంది. ఇక అఖిల్ తో పాటే కెరీర్ మొద‌లు పెట్టిన స‌యేషా సైగ‌ల్ మాత్రం ఇప్పుడు త‌మిళ‌నాట స్టార్ హీరోయిన్ గా దున్నేస్తుంది. అఖిల్ కెరీర్ ఇప్పుడు ఇంకా దారిలోకి రాలేదు కానీ ఈయ‌న‌తో పాటే ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన స‌యేషా సైగ‌ల్ మాత్రం త‌న కెరీర్ ను చాలా చ‌క్క‌గా ప్లాన్ చేసుకుంటుంది. ఓ సినిమా ఫ్లాప్ అయితే ఆ హీరోయిన్ వైపు చూడ్డానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌రు ద‌ర్శ‌క నిర్మాత‌లు. హీరోలు కూడా ఫ్లాప్ హీరోయిన్ ఎందుకు అంటారు. కానీ స‌యేషా సైగ‌ల్ విష‌యంలో మాత్రం అలా జ‌ర‌గ‌డం లేదు. అఖిల్ ఫ్లాప్ త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీ వైపు చూడ్డ‌మే మానేసింది స‌యేషా.

ఆ మ‌ధ్య హిందీలో శివాయ్ సినిమాలో న‌టించింది స‌యేషా సైగ‌ల్. ఇక ఇప్పుడు పూర్తిగా త‌మిళ ఇండ‌స్ట్రీకే ప‌రిమితం అయిపోయింది స‌యేషా. అక్క‌డే వాళ్లు చేర‌దీస్తున్నారు ఈ భామ‌ను. ఇప్ప‌టికే అక్క‌డ జ‌యం ర‌వి లాంటి క్రేజీ హీరోల‌తో న‌టించింది స‌యేషా సైగ‌ల్. అయితేనేం.. ప్ర‌స్తుతం నాలుగు సినిమాల‌తో బిజీగా ఉంది స‌యేషా. అవి కూడా చిన్న సినిమాలేం కాదు.. విజ‌య్ సేతుప‌తితో జంగ‌.. ఆర్య‌తో భ‌లే భ‌లే మ‌గాడివోయ్ రీమేక్ గ‌జినీకాంత్.. విజ‌య్- మురుగ‌దాస్ సినిమాలో రెండో హీరోయిన్.. క‌డాయ్ కుట్టి సింగం.. ఇలా చాలా సినిమాల్లో న‌టిస్తుంది అఖిల్ బ్యూటీ. ఇకిప్పుడు కేవీ ఆనంద్-సూర్య కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమాలో కూడా స‌యేషానే హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ విష‌యాన్ని తానే అనౌన్స్ చేసింది స‌యేషా. దీనికి అఖిల్ ఆల్ ది బెస్ట్ స‌యేషా అంటూ రిప్లై ఇచ్చాడు. అన్నీ కానీ హిట్టైతే స‌యేషా ద‌శ మారిపోయిన‌ట్లే..! మ‌రి ఇక్క‌డ మ‌నోడి జాత‌కం ఎప్పుడు మారుతుందో..?

User Comments