అఖిల్ – 3 లుక్ లాంచ్ తేదీ

Last Updated on by

అఖిల్ అక్కినేని త‌న కెరీర్ మూడో చిత్రంలో న‌టిస్తున్న సంగతి తెలిసిందే. `స‌వ్య‌సాచి` ఫేం నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌. `తొలి ప్రేమ` ఫేం వెంకీ అట్లూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బ్రిట‌న్‌లో ఈ సినిమా మెజారిటీ పార్ట్ చిత్రీక‌ర‌ణ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్టు 14 నాటికి 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు? ఫ‌స్ట్‌లుక్ ఎప్పుడు లాంచ్ చేస్తారు? అన్న‌దానికి ఇంత‌కాలం ఏ క్లారిటీ లేదు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. కింగ్ నాగార్జున పుట్టిన‌రోజు కానుక‌గా ఆగ‌స్టు 29న ఈ సినిమా టైటిల్‌ని ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. అదే రోజు ఫ‌స్ట్‌లుక్‌ని లాంచ్ చేస్తారు. ఇది అక్కినేని ఫ్యాన్స్‌కి శుభ‌వార్తే. ఇక ఈ సినిమా 70శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యిపోతోంది కాబ‌ట్టి అఖిల్‌కి కాస్తంత రిలీఫ్ దొరికింద‌నే చెప్పాలి. ఈ సినిమా ద‌ర్శ‌కుడు వెంకీతో అఖిల్ గొడ‌వ ప‌డ్డాడ‌ని ఇదివ‌ర‌కూ వ‌చ్చిన వార్త‌ల‌కు చెక్ పెడుతూ ఆ ఇద్ద‌రూ ఓ వీడియోని మీడియాకి పంపించిన సంగ‌తి తెలిసిందే. ష్యూర్‌షాట్‌గా అఖిల్ హిట్ కొట్టాల్సిన వేళ న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు వెంకీ ఎలాంటి బ్రేక్‌నివ్వ‌బోతున్నాడో అన్న ఆస‌క్తి నెల‌కొంది.

User Comments