పిక్ టాక్‌: అక్కినేని బాంబ‌ర్

Last Updated on by

ఒకేసారి ఇద్ద‌రు అక్కినేని హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ వేడి పెంచింది నిధి అగ‌ర్వాల్‌. ఈ బెంగ‌ళూరు బాలిక స్పీడ్ చూసి కుర్ర‌కారుకు కంటిమీద కునుకే ప‌ట్ట‌లేదంటే ఒట్టు. నిధి అగ‌ర్వాల్ సోష‌ల్ మీడియాలోనూ టూ ఫాస్ట్. రెగ్యుల‌ర్‌గా ఈ అమ్మ‌డి ఇన్‌స్టా, ట్విట్ట‌ర్‌లు వెతికితే అక్క‌డ ద‌ర్శ‌న‌మిచ్చే ఫోటోల‌కు యూత్ అడిక్ట్ అయిపోవ‌డం ఖాయం.

ఇదిగో ఇదో మ‌చ్చుతునక‌. నిధిలో వాడి వేడి ఏ రేంజులో ఉందో అర్థం చేసుకునేందుకు ఈ ఒక్క ఫోటో చాల‌దూ? ఒంపు సొంపుల వ‌య్యారాల్ని వాడి వేడిగా వ‌డ్డిస్తా! విందార‌గించండి!! అన్న చందంగా నిధి త‌న అందాల‌తో వ‌ల‌లు వేస్తోంది. `మున్నా మైఖేల్` చిత్రంలో టైగ‌ర్ ష్రాఫ్ స‌ర‌స‌న న‌టించింది. ఆ త‌ర్వాత వెంట‌నే ఇటు టాలీవుడ్‌లో క్రేజీగా అవ‌కాశాలు అందుకుంది. చైత‌న్య స‌ర‌స‌న `స‌వ్య‌సాచి` చిత్రంలో న‌టిస్తున్న ఈ అమ్మ‌డు, అఖిల్ మూడో సినిమాలోనూ నాయిక‌గా ఆడిపాడుతోంది. `స‌వ్య‌సాచి` ద‌స‌రా బ‌రిలో రిలీజ‌వుతుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అప్ప‌టికి అఖిల్ సినిమా కొత్త అప్‌డేట్లు చెబుతారేమో చూడాలి. `ఏ థౌజండ్ స‌న్స్(సూర్యులు) విల్ క్యారీ మీ` అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చింది. వెయ్యిమంది సూర్యులు టెంప్ట‌వుతార‌నే దీన‌ర్థ‌మా? అక్కినేని బాంబ‌ర్ మీనింగేంటో?

User Comments