అక్కినేని న‌వ‌నాయిక కిక్కోకిక్కు

Last Updated on by

ఒకటో సినిమా రిలీజ్ కాక‌ముందే రెండో ఛాన్స్ అందుకోవ‌డం అంటే ఆషామాషీనా? అలాంటి స్పీడ్‌తో డూసుకొచ్చింది క‌న్న‌డ బ్యూటీ నిధి అగ‌ర్వాల్‌. ఆరంగేట్ర‌మే అక్కినేని యువ‌హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు ప‌ట్టేసింది. అయితే అవ‌కాశం అందుకుంటే స‌రిపోయిందా? అందుకు త‌గ్గ‌ట్టే స‌త్తా చాటాల్సి ఉంటుంది. అందుకే నిధి ఎంతో శ్ర‌మిస్తోంది. ఓవైపు న‌ట‌న‌కు మెరుగులు దిద్దుతూ డ్యాన్స్ ప్రాక్టీస్‌లోనూ క‌ఠోరంగా శ్ర‌మిస్తోందిట‌. నిధి ఇన్‌స్టాగ్ర‌మ్ ప‌రిశీల‌స్తే అందులో వీడియోలు ఆ మాట చెబుతాయి. ఇక నిధిని ఫాలో అవుతున్న యువ‌త‌రానికి అక్క‌డ కావాల్సినంత మేత బోలెడంత‌.

అక్కినేని నాగ‌చైత‌న్య స‌ర‌స‌న స‌వ్య‌సాచిలో న‌టిస్తున్న నిధి, ఆ సినిమా సెట్స్‌లో ఉండ‌గానే, అఖిల్‌3లో అవ‌కాశం అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఆన్ లొకేష‌న్ నిధి చురుకైన పెర్ఫామెన్స్ గురించి గుడ్ రిపోర్ట్ అందింది. ఆగ‌స్టు 31న రిలీజ‌వుతున్న `స‌వ్య‌సాచి`కి నిధి గ్లామ‌ర్ పెద్ద ప్ల‌స్ కానుంద‌న్న మాటా వినిపిస్తోంది.
మ‌రోవైపు నిధి రెండో సినిమాపైనా అంతే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అఖిల్ 3` మెజారిటీ పార్ట్ చిత్రీక‌ర‌ణ యూకేలో పూర్త‌యింది. త‌దుప‌రి హైద‌రాబాద్ షెడ్యూల్ ఉంటుంద‌న్న స‌మాచారం ఉంది. ఈ రెండు సినిమాల్లో న‌టిస్తూనే, మ‌రోవైపు నిధి బాలీవుడ్‌లో ఛాన్సుల కోసం వేట సాగించ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అక్కినేని నాయిక‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై, అటుపై ఇక్క‌డ ఏ రేంజులో హ‌వా సాగించ‌నుందో వేచి చూడాలిక‌.

https://www.instagram.com/p/Bl3J4iwHVgA/?taken-by=nidhhiagerwal

User Comments