అక్కినేని నాగచైతన్య ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. మజిలీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తరువాత రెట్టించిన ఉత్సాహాంతో సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే వెంకీమామ షూటింగ్ పూర్తిచేసి ప్రస్తుతం శేఖర్ కమ్ములతో షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇంకా అజయ్ భూపతి సహా పలువురి డైరెక్టర్లని లైన్ లో పెట్టాడు. ఇటీవలే బాలీవుడ్ లో విజయం సాధించిన చిచ్చోరే రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. ఆ చిత్రాన్ని గీతగోవిందం దర్శకుడు పరుశురాం తెరకెక్కించనున్నాడని.. ఓ పెద్ద నిర్మాణ సంస్థ నిర్మించడానికి ముందుకొచ్చిందని ప్రచారమైంది. ఈ సినిమా కోసమా లేక వేరొక సినిమా కోసమో కానీ చైతూ సరసన రష్మిక మందనని జోడిగా ఎంపిక చేసినట్లు వినిపిస్తోంది.
రష్మికను స్టార్ హీరయిన్ ని చేసింది పరశురామ్. గీతగోవిందంలో గీతగా ఛాన్సిచ్చి మైలేజ్ ఇచ్చాడు. రష్మిక పాత్రను తెరపై అద్భుతంగా చూపించాడు. ఆ పాత్రకు తానైతే న్యాయం చేయగలదని నూరుశాతం నమ్మి అవకాశం ఇచ్చినందుకు అంతకు మించిన బెస్ట్ పెర్పామెన్స్ ని ఇచ్చింది రష్మిక. అందుకే మరోసారి పరశురాం ఆప్షన్ గీతనే అయింటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక వరుసగా సినిమాలో బిజీగా ఉంది. మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరులోనూ, నితిన్ సరసన భీష్మలోనూ నటిస్తోంది. బన్నీ -సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రంలోనూ రష్మిక హీరోయిన్ గా నటించనున్న సంగతి తెలిసిందే. ఇంకా పలు ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతోంది. అటు తమిళ్, కన్నడ సినిమాలకు సమయం కేటాయిస్తోంది.