పండ‌గ‌ల్ని బ్లాక్ చేసిన‌ అక్కినేనీస్!

Last Updated on by

ద‌స‌రా .. సంక్రాంతి పండ‌గలు అంటే బాక్సాఫీస్ బొనాంజ అన్న సంగ‌తి తెలిసిందే. ఆ రెండు సీజ‌న్లు సినిమాలు ఆడించేవాళ్ల‌కు య‌మ క్రేజీ. సెల‌వు దినాల్ని పుష్క‌లంగా క్యాష్ చేసుకునేందుకు ఉన్న ఆస్కారాన్ని ఏమాత్రం విడిచిపెట్ట‌రు. అందుకే ఈసారి అక్కినేని కాంపౌండ్ ఈ రెండు పండ‌గ‌ల్ని బ్లాక్ చేస్తోంది. అందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశార‌ట‌.

2019 ని అక్కినేని కాంపౌండ్ త‌మ‌కు ఫేవ‌ర్ గా మార్చుకునేందుకు సన్నాహ‌కాల్లో ఉన్నారు. ముఖ్య ంగా ద‌స‌రాని అక్కినేని నాగ‌చైత‌న్య‌, సంక్రాంతిని కింగ్ నాగార్జున లాక్ చేస్తున్నార‌ట‌. ఈనెల చివ‌రిలో వెంక‌టేష్ – నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా `వెంకీ మామ` చిత్రం ప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేసి ద‌స‌రా సెల‌వుల్లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. అలాగే కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వ ంలో తెర‌కెక్క‌నున్న `బంగార్రాజు` చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తార‌ని తెలుస్తోంది. ఈ సినిమాని తొంద‌ర్లోనే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. అలాగే వారం గ్యాప్ లో నాగార్జున మ‌న్మ‌ధుడు 2 చిత్రాన్ని ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది.

User Comments