Last Updated on by
అక్కినేని చియాన్ అఖిల్ నటించిన సినిమాలు ఫ్లాపైనా, నటుడిగా మాత్రం ఫ్లాప్ కాలేదు. ముఖ్య ంగా అతడు రెండో సినిమాతోనే అసాధారణ పరిణతి చూపించాడు. `హలో` చిత్రం ఫీల్ మిస్సయి ఫ్లాపైంది. అది ఎత్తుగడలో తప్పు కావచ్చు. అయితే ఆ సినిమాలో అఖిల్ నటన, డ్యాన్సులు, ఫైట్స్ ఏ విషయంలో చూసినా ది బెస్ట్‌గా కనిపించాడు. అందుకే రిలీజ్ ముందే సినిమా చూసిన నాగార్జున- అమల బృందం అఖిల్‌పై ఎన్నో హోప్స్ పెట్టుకుని దానిని మీడియా ముందే ప్రకటించారు. అదంతా అటుంచితే అఖిల్ యాక్షన్‌లో మాత్రం మిసైల్ మెరుపులు మెరిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఏ ఇతర హీరోకి లేనంత ఛామ్ అతడిలో ఉంది. పక్కాగా అథ్లెటిక్ దేహశిరులు, ఎటైనా మెలితిరిగే ఫ్లెక్సిబిలిటీ అఖిల్ బాడీలో ఉంది. అది అతడికి అసాధారణ గుర్తింపు తెస్తోంది. ముఖ్య ంగా యాక్షన్ హీరోగా ప్రత్యేక గుర్తింపునిస్తోంది. ఇప్పుడు అదే క్వాలిటీ అఖిల్‌కి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చింది.
విక్రమ్.కె. కుమార్ తెరకెక్కించిన `హలో` చిత్రంలో అఖిల్ స్టంట్స్‌కి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. `హలో`కి ఫారిన్ ఫిల్మ్ ఎట్ వరల్డ్ స్టంట్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్షన్ సినిమా కేటగిరీకి నామినేట్ అయింది. ఈ సంగతిని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన దర్శకుడు విక్రమ్.కె.కుమార్ ఈ సందర్భ ంలో కాస్తంత ఎమోషనల్ అయ్యారు. ముఖ్య ంగా అఖిల్ శ్రమను, కష్టాన్ని ప్రత్యేకంగా పొగిడేశాడు. ‘‘హలో సినిమా ఫారిన్ ఫిలిం ఎట్ వరల్డ్ స్టంట్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్షన్ సినిమా కేటగిరీకి నామినేట్ అయిందని తెలిసి చాలా గర్విస్తున్నా. బాబ్ బ్రౌన్, పీఎస్ వినోద్, అనూప్ రూబెన్స్, నాగ్ సార్ చాలా ఆనందించారు. మీరంతా కలిసి ఈ సినిమాను చాలా స్పెషల్ చేశారు. అఖిల్ అక్కినేని ఇది నీ డెడికేషన్‌కు, హార్డ్ వర్క్‌కు దక్కిన ప్రతిఫలం. నీ యాటిట్యూడ్ నిన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఇలానే ఉండు. మచ్ లవ్“ అంటూ విక్రమ్ ట్వీట్ చేసాడు. `హలో` చిత్రంలో అసాధారణ స్టంట్స్‌ని కొరియోగ్రాఫ్ చేసింది ప్రఖ్యాత హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ బాబ్ బ్రౌన్. అఖిల్ బాడీ లాంగ్వేజ్‌కి, మిసైల్ వేగానికి తగ్గట్టు అతడు ఫైట్స్‌ని అందించారు. ఇప్పుడు ఆ ఇద్దరికీ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. హలో టీమ్‌కి ఇది ఆనందదాయకమైన వార్త.
User Comments