ట్రెండింగ్‌: అక్కినేని- ఎన్టీఆర్ బంధం

Last Updated on by

అక్కినేని ఫ్యామిలీతో నంద‌మూరి కుటుంబం అనుబంధం గురించి తెలిసిందే. నాడు ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఎంతో స్నేహంగా ఉండేవారు. కొలీగ్స్ గా పోటీప‌డినా, స్నేహాన్ని మాత్రం కొన‌సాగించారు. కానీ కాల‌క్ర‌మంలో కింగ్ నాగార్జున‌కు .. నంద‌మూరి బాల‌కృష్ణ‌తో పొర‌పొచ్చాలు వ‌చ్చాయ‌న్న ప్ర‌చారం సాగింది. ఏఎన్నార్ మ‌ర‌ణించాక అంత్య క్రియ‌ల్లోనూ బాల‌య్య క‌నిపించ‌లేదు. అంత‌కుముందే బాల‌య్య‌తో కింగ్ కి ఏదో డిస్ట్ర‌బెన్స్ ఉంద‌ని ఫిలింన‌గ‌ర్ లో ముచ్చ‌టించుకున్నారు.
అదంతా అటుంచితే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో అక్కినేనీస్ అనుబంధంపై టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. నిన్న సాయంత్రం జ‌రిగిన మిస్ట‌ర్ మ‌జ్ను ట్రైల‌ర్- ప్రీరిలీజ్ వేడుక‌లో అక్కినేని నాగార్జున – అఖిల్- ఎన్టీఆర్ ఒకే వేదిక‌పై ఎంతో ఎమోష‌న‌ల్ గా మాట్లాడారు. త‌మ మ‌ధ్య ఉన్న బాండింగ్ గురించి ఆస‌క్తి క‌లిగించే సంగ‌తుల్ని రివీల్ చేశారు.
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ – నాగార్జునగారిని నేను బాబాయ్‌ అని పిలిస్తే.. ఆయన నన్ను అబ్బాయ్‌ అని పిలుస్తుంటారు. ఇక్కడకు గెస్ట్‌లా కాకుండా కుటుంబ సభ్యుడిలా వచ్చాను. ఇక్కడ కేవలం బాబాయ్‌, చైతు, అఖిలే కాకుండా సినిమాకు పనిచేసిన చాలా మంది నాకు చాలా కావాల్సిన వాళ్లు ఉన్నారు“ అంటూ ఎన్టీఆర్ ప్ర‌స్థావించారు. ఇక అఖిల్ మాట్లాడుతూ .. తార‌క్ గారు అంటే బ‌లిసిందా? అంటూ తిట్టేస్తాడ‌ని ఎన్టీఆర్ గురించి అఖిల్ చెప్పాడు. తార‌క్ అన్నా అని అఖిల్ సంబోధించాడు. ఇక త‌మ మ‌ధ్య బంధం ఎంతో కాలంగా ఉంద‌ని అక్కినేనీస్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఆస‌క్తిక‌రంగా నంద‌మూరి – అక్కినేని అభిమానులు ఈ వేడుక‌కు విచ్చేయ‌గా అభిమానుల్ని క‌లిపేసుకుంటూ అఖిల్ చేసిన ప్ర‌సంగం  ఆక‌ట్టుకుంది. మొత్తానికి అక్కినేని- ఎన్టీఆర్ అనుబంధం ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌కొచ్చింది. మిస్ట‌ర్ మ‌జ్ను ఈనెల 25న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

User Comments