ఆ న్యూడ్ మూవీ కోసం స‌మంత వెయిటింగ్!

న‌ల్ల క‌లువ అమ‌లాపాల్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఆడై చిత్రం తెర‌కెక్కుతోన్న‌ సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తోనే అమ‌లాపాల్ అటెన్ష‌న్ డ్రా చేసింది. తాజాగా నిన్న‌టి రోజున రిలీజ్ అయిన‌ టీజ‌ర్ తో అమ్మ‌డు ప్ర‌శంస‌ల వర్షంలో త‌డిసి ముద్ద‌వుతోంది. ఇందులో అమ‌ల న్యూడిటీని ఓ రేంజ్ లో ఎక్స్ ఫోజ్ చేసింది. పాత్ర డిమాండ్ మేర‌కు అమ‌ల చేసిన సాహ‌సం నిజంగా ప్ర‌శంస‌నీయం. అందుకే టీజ‌ర్ ని చూసిన ప్ర‌తీ సెల‌బ్రిటీ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. అందులో భాగంగా స‌మంత కూడా స్పందించింది.

టీజర్ ఉత్కంఠను క‌లిగిస్తోంది. బెస్ట్ విషెస్ టు అమలాపాల్. సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నా అని ట్వీట్చేసింది. కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌ల‌ను ఆధారంగా చేసుకుని చిత్రాన్ని ర‌త్న‌ కుమార్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించారు. అమ‌లాపాల్ , ఎ. ఎల్ విజ‌య్ తో విడాకుల త‌ర్వాత కొన్ని సినిమాల్లో న‌టించింది గానీ క‌లిసి రాలేదు. కానీ అమ్మ‌డు ఇలా న‌గ్నంగా న‌టించ‌డంతో రిలీజ్ కు ముందే సంచ‌ల‌న సృష్టి స్తోంది. రిలీజ్ త‌ర్వాత ఇంకే స్థాయిలో క్రెడిట్ ద‌క్కుతుందో చూడాలి. వి స్టూడియోస్ బ్యానర్ పై విజ్జి సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Also Watch : Kajal’s  First  Look From Ranarangam Out