Last Updated on by
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా `కాంచన` చిత్రం రీమేక్ కానుందా? అంటే అవుననే సమాచారం. ఆ మేరకు లారెన్స్ ఇప్పటికే సన్నాహకాల్లో ఉన్నారట. లారెన్స్ ప్రారంభించిన హారర్ కామెడీ సిరీస్ లో ముని, కాంచన, గంగ చిత్రాలు ఎంత పెద్ద సక్సెసయ్యాయో తెలిసిందే. వీటన్నిటినీ మిక్స్ చేసి ఓ కొత్త సినిమాని అక్షయ్ తో తెరకెక్కించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. సాధ్యమైనంత తొందర్లోనే స్క్రిప్టు వర్క్ పూర్తి చేసి జూన్ లేదా జూలైలో సినిమాని ప్రారంభిస్తారని తెలుస్తోంది. దాదాపు 70రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలన్నది లారెన్స్ బృందం ప్లాన్ అని తెలిసింది.
అసలు దెయ్యం అంటేనే భయం అని చెప్పే అక్షయ్ ఈ చిత్రానికి అంగీకరించడం ఓ మిరాకిల్ అని చెబుతున్నారు. అక్కీ తనని తాను కొత్త జోనర్ లలో ప్రెజెంట్ చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఆ కోవలోనే ఈ హారర్ కామెడీ చిత్రాన్ని అంగీకరించారని చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే లారెన్స్ నక్కతోక తొక్కినట్టే. బాలీవుడ్ లో ప్రభుదేవా తరహాలోనే అతగాడు పెద్ద సక్సెసవుతాడనే అభిమానులు భావిస్తున్నారు. 2020 నాటికి పూర్తి చేసి రిలీజ్ చేసే ఈ సినిమాలో కాస్టింగ్ ఎవరు.. నిర్మాత ఎవరు? అన్నది తెలియాల్సి ఉందింకా.
User Comments