అక్ష‌య్.. నువ్వు గోల్డ్ ఎహే..

తెలుగులో సునీల్ ఈడు గోల్డ్ ఎహే అనే సినిమా చేసాడు క‌దా నిజానికి ఈ టైటిల్ సునీల్ కంటే అక్ష‌య్ కుమార్ కు బాగా సూట్ అవుతుంది. బాలీవుడ్ లో ఈయ‌న చేసిన‌న్ని ప్ర‌యోగాలు చేయ‌డానికి ఈ మ‌ధ్య కాలంలో మ‌రే స్టార్ హీరోకు ధైర్యం కూడా రాలేదు. ఒక‌ప్పుడు యాక్ష‌న్ రూట్ నుంచి.. కామెడీ ట‌ర్న్ తీసుకుని.. ఇప్పుడు భిన్న‌మైన క‌థ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారిపోయాడు అక్ష‌య్ కుమార్. రుస్తోం సినిమాతో ఈ మ‌ధ్యే జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు కూడా తీసుకున్నాడు అక్ష‌య్ కుమార్. కొన్నేళ్లుగా ఈయ‌న చేస్తోన్న సినిమాలు చూస్తుంటే డ‌బ్బు కంటే కూడా ఇంకేదో కావాల‌నిపిస్తుంది. అది న‌టుడిగా ఎదగాల‌నే కోరిక కావ‌చ్చు.. త‌న సినిమాల‌తో స‌మాజానికి ఏదో మంచి చేయాల‌నే భావ‌న కావ‌చ్చు. ప్ర‌తీ సినిమాలోనూ ఏదో కొత్త‌గా చెప్ప‌డానికి చూస్తున్నాడు అక్ష‌య్.
అక్ష‌య్ న‌టిస్తోన్న గోల్డ్ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. పీప్లీలైవ్ లాంటి సామాజిక నేప‌థ్యం ఉన్న సినిమా తెర‌కెక్కించిన రీమాఖ‌గ్టీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుంది. 1948.. స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌ర్వాత మ‌న దేశం గెలిచిన తొలి ఒలంపిక్ స్వ‌ర్ణ ప‌థ‌కం నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా ఇది. హాకీ జ‌ట్టు ఇండియాకు తొలి బంగారు ప‌థకాన్ని తీసుకొచ్చింది. అప్ప‌టి వ‌ర‌కు గెలిచిన ప‌థ‌కాల‌న్నీ బ్రిటీష్ ఖాతాలోకి వెళ్లాయి. ఇది మాత్రం మ‌న దేశం త‌రఫున వ‌చ్చిన తొలి ప‌థ‌కం. అందుకే ఈ నేప‌థ్యంలోనే సినిమా వ‌స్తుందిప్పుడు. ఈ టీజ‌ర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండ‌బోతుందో అర్థ‌మైపోతుంది. ఆగ‌స్ట్ 15న గోల్డ్ విడుద‌ల కానుంది.
ఈ మ‌ధ్యే అక్ష‌య్ మొద‌లుపెట్టిన కేస‌రి కూడా ఇలాంటిదే. 1879 స‌రాగ‌ర్హి యుద్ధం ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇందులో స‌ర్దార్ జీగా న‌టిస్తున్నాడు అక్ష‌య్ కుమార్. ఈ చిత్రాన్ని అనురాగ్ సింగ్ తెర‌కెక్కిస్తున్నాడు. క‌ర‌ణ్ జోహార్ నిర్మాత‌. బాలీవుడ్ లో ఎంత‌మంది హీరోలున్నా అక్ష‌య్ మాత్రం ప్ర‌త్యేకం. ఈయ‌న చేసే సినిమాలు ప్ర‌త్యేకం.. క‌థ‌లు ప్ర‌త్యేకం. వాటినే ప్రేక్ష‌కులు కూడా కోరుకుంటున్నారు. ఏడాదికి క‌నీసం ఈయ‌న వ‌ల్ల 500 కోట్ల‌కి పైగా బిజినెస్ జ‌రుగుతుంది బాలీవుడ్ లో. ఏదో క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేసి చేతులు దులిపేసుకుందాం అనుకోకుండా త‌నకున్న ఇమేజ్ ను సామాజిక బాధ్య‌త కోసం వాడుకుంటున్నాడు అక్ష‌య్ కుమార్. ఇదే ఇప్పుడు ఈయన్ని మిగిలిన హీరోల నుంచి వేరు చేస్తుంది. అంతెందుకు గ‌తేడాది ఈయ‌న న‌టించిన జాలీ ఎల్ఎల్ బీ 2తో పాటు టాయ్ లెట్ కూడా సూప‌ర్ హిట్టైంది. ఈ రెండు సినిమాల్లోనూ సమాజానికి కావాల్సిన విష యాల‌నే డిస్క‌స్ చేసాడు అక్ష‌య్.
ప్ర‌తీ ఇంట్లో ఓ బాత్రూమ్ ఉండాలి.. ఆడ‌వాళ్ల‌ను గౌర‌వించాలి.. అని చెప్పే క‌థే టాయ్ లెట్. ఈ సినిమా చూసిన త‌ర్వాత ప్ర‌ధాని మోదీతో పాటు అంతా అక్ష‌య్ పై ప్ర‌శంసల జ‌ల్లు కురిపించారు. ఇప్పుడు మ‌రో సినిమా చేస్తున్నాడు అక్ష‌య్. అదే ప్యాడ్ మ్యాన్. ఆడ‌వాళ్ళ‌కు పీరియ‌డ్స్ వ‌చ్చిన‌పుడు వ‌చ్చే ఇబ్బందుల‌ను ఈ సినిమాలో చూపించ‌బోతున్నారు అక్ష‌య్ కుమార్ అండ్ టీం. బాల్కీ ద‌ర్శ‌కుడు. ఈ చిత్ర ట్రైల‌ర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండ‌బోతుందో అర్థ‌మైపోతుంది. క‌నీసం ఆలోచించ‌డానికి కూడా భ‌య‌ప‌డే కాన్సెప్ట్ తీసుకుని సినిమా చేసాడు అక్ష‌య్ కుమార్. ఫిబ్ర‌వ‌రి 9న ప్యాడ్ మ్యాన్ విడుద‌ల కానుంది. ఇది విడుద‌ల కాక‌ముందే ఇప్పుడు గోల్డ్.. కేస‌రి అంటున్నాడు. మొత్తానికి అక్ష‌య్ ఇప్పుడు వ‌న్ అండ్ ఓన్లీ రియ‌ల్ హీరో అయిపోయాడు.