ప్యాడ్ మ్యాన్ కు ట్యాక్స్ ఫ్రీ నిజమేనా?

Last Updated on by

జిఎస్టీ అంటే వ‌ర్మ తెర‌కెక్కించిన జిఎస్టీ కాదు.. ఖ‌ర్మ ఏం చేస్తాం.. అప్పుడు జిఎస్టీ అంటే మోడీ గుర్తొచ్చేవాడు ఇప్పుడు వ‌ర్మ గుర్తొస్తున్నాడు. అయితే ఇప్పుడు మ‌నం మాట్లాడుకుంటున్న‌ది మాత్రం నిజ‌మైన జిఎస్టీ గురించే. దాన్ని ఇప్పుడు సినిమా భాష‌లో ట్యాక్స్ అంటున్నారు. సినిమా ట్యాక్స్ చాలా ఎక్కువ‌గా ఉంటుంది బాలీవుడ్ సినిమాల‌కు. అయితే జిఎస్టీ వ‌చ్చిన త‌ర్వాత వాళ్ల‌కు 17 శాతం క‌లిసొచ్చింది. ఇంత‌కుముందు 44 ప‌ర్సెంట్ ఉండేది ఇప్పుడు 28 శాతానికి ప‌డిపోయింది. అయితే ఇప్పుడు ప్యాడ్ మ్యాన్ సినిమాకు జిఎస్టీ లేకుండా చేస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. జాతీయ వ్యాప్తంగా ఈ చిత్రానికి ట్యాక్స్ ఫ్రీ ఇస్తార‌ని తెలుస్తుంది. అయితే ఈ విష‌యంపై ట్వింకిల్ ఖ‌న్నా స్పందిస్తూ అలాంటిదేమీ లేదు అని చెప్పింది.

సిజిఎస్టీ ఫ్రీ ఉండదు కాని ఎస్ జిఎస్టీ (స్టేట్ ట్యాక్స్) ఫ్రీ ఉండొచ్చు ఎందుకంటే ఎస్ జిఎస్టీ ఆయా రాష్ట్రాలు డిసైడ్ చేస్తాయి. మొన్న వ‌చ్చిన టాయ్ లెట్ సినిమాకు ఉత్త‌ర ప్ర‌దేశ్ ట్యాక్స్ ఫ్రీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్యాడ్ మ్యాన్ కు ఏయే రాష్ట్రాలు స‌పోర్ట్ చేస్తాయో తెలియ‌డం లేదు. బాలీవుడ్ లో ఎంత‌మంది సూప‌ర్ స్టార్స్ అయినా ఉండొచ్చు కానీ అక్ష‌య్ కుమార్ తో మాత్రం వాళ్లు పోటీకి రాలేదు. ఈ విష‌యంలో ఈయ‌నే నెంబ‌ర్ వ‌న్ హీరో. ఉన్న ఇమేజ్ ను ఎలా వాడుకోవాలి.. సామాజిక క‌థ‌లు ఎలా చేయాల‌నే విష‌యంపై ఇప్పుడు అక్ష‌య్ ఆరితేరిపోయాడు. త‌న సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు నాలుగు మంచి ముక్కలు చెబితే అదే 100 కోట్లు అనుకుంటున్నాడు అక్ష‌య్ కుమార్.

సూప‌ర్ స్టార్ ఇమేజ్ ఉండి కూడా కొత్త క‌థ‌ల్లో న‌టించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఇప్పుడు ఈయ‌న న‌టించిన ప్యాడ్ మ్యాన్ అలాంటి సినిమానే. ఆడ‌వాళ్ల ప‌ర్స‌న‌ల్ ప్రాబ్ల‌మ్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా ఇది. అంద‌రికీ ప్యాడ్
ఖచ్చితంగా అవ‌స‌రం అని చెప్పే సినిమా ఇది. ఇలాంటి స‌బ్జెక్ట్ ట‌చ్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. అది చేసాడు అక్ష‌య్ కుమార్. ఆయ‌న‌తో క‌లిసి బాల్కీ కూడా ఈ ప్ర‌య‌త్నంలో భాగం పంచుకున్నాడు. ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానుంది ఈ చిత్రం. ప్యాడ్ మ్యాన్ విడుద‌ల త‌ర్వాత అక్ష‌య్ ఇమేజ్ మ‌రింత పెర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఈ చిత్రంలో సోన‌మ్ క‌పూర్, రాధికా ఆప్టే హీరోయిన్లుగా న‌టించారు.

User Comments