అక్ష‌య్.. ది రియ‌ల్ సూప‌ర్ స్టార్..

బాలీవుడ్ లో ఎంత‌మంది సూప‌ర్ స్టార్స్ అయినా ఉండొచ్చు కానీ అక్ష‌య్ కుమార్ తో మాత్రం వాళ్లు పోటీకి రాలేదు. ఈ విష‌యంలో ఈయ‌నే నెంబ‌ర్ వ‌న్ హీరో. ఉన్న ఇమేజ్ ను ఎలా వాడుకోవాలి.. సామాజిక క‌థ‌లు ఎలా చేయాల‌నే విష‌యంపై ఇప్పుడు అక్ష‌య్ ఆరితేరిపోయాడు. త‌న సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు నాలుగు మంచి ముక్కలు చెబితే అదే 100 కోట్లు అనుకుంటున్నాడు అక్ష‌య్ కుమార్. సూప‌ర్ స్టార్ ఇమేజ్ ఉండి కూడా కొత్త క‌థ‌ల్లో న‌టించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఇప్పుడు ఈయ‌న న‌టించిన ప్యాడ్ మ్యాన్ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత అంతా ఒకేమాట అంటున్నారు. అక్ష‌య్ రియ‌ల్ సూప‌ర్ స్టార్ అని. ఆడ‌వాళ్ల ప‌ర్స‌న‌ల్ ప్రాబ్ల‌మ్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా ఇది. అంద‌రికీ ప్యాడ్ క‌చ్చితంగా అవ‌స‌రం అని చెప్పే సినిమా ఇది. ఇలాంటి స‌బ్జెక్ట్ ట‌చ్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. అది చేసాడు అక్ష‌య్ కుమార్. ఆయ‌న‌తో క‌లిసి బాల్కీ కూడా ఈ ప్ర‌య‌త్నంలో భాగం పంచుకున్నాడు. ఇప్పుడు విడుద‌లైన ట్రైల‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుంది.

ఇదొక్క‌టే కాదు.. ఈ మ‌ధ్య కాలంలో అన్నీ ప్ర‌యోగాలే చేస్తున్నాడు అక్ష‌య్ కుమార్. అస‌లు ఓ స్టార్ హీరో సినిమాకు టాయ్ లెట్ అనే పేరు పెడితే ఛీ ఏంటీ టైటిల్ అంటారు. కానీ అక్ష‌య్ కుమార్ మాత్రం దీనికి భిన్నం. ఆయ‌న సినిమా కోసం ఏదైనా చేస్తాడు. ఆ మ‌ధ్య ఇదే చేసాడు. సాధార‌ణంగా ఇంత ఇమేజ్ ఉన్న హీరోకు ఇలాంటి క‌థ చెబితే ఎవ‌రైనా నో అంటారు. కానీ అక్ష‌య్ మాత్రం ఓ మంచి ప‌ని కోసం ఈ సినిమా చేసాడు. ప్ర‌తీ ఇంట్లో ఓ బాత్రూమ్ ఉండాలి.. ఆడ‌వాళ్ల‌ను గౌర‌వించాలి.. అని చెప్పే క‌థ ఇది. ఈ సినిమా చూసిన త‌ర్వాత అంతా అక్ష‌య్ పై ప్ర‌శంసల జ‌ల్లు కురిపించారు.. ప్ర‌ధాని మోదీతో పాటు. మొత్తానికి వ‌రస విజ‌యాలే కాదు.. అంత‌కంటే మంచి క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు అక్ష‌య్ కుమార్.