క్రోమ్యాన్ భీభ‌త్స కాండ‌

ప‌శుప‌క్షాదుల‌కు మ‌న‌సుంటుంద‌ని, వాటికీ కోపం ఉంటుంద‌ని ఏనాడైనా గ్ర‌హించారా ఈ మాన‌వులు? అందుకు ఫ‌లితం అనుభ‌వించాల్సిందే. త్వ‌ర‌లో వ‌స్తున్నాడు క్రోమ్యాన్. భూమ్మీద విధ్వ ంశం సృష్టించేందుకు.. దాడులు చేసేందుకు.. గెట్ రెడీ..

మాన‌వాళి టెక్నాల‌జీ దాహంతో, సెల్‌ఫోన్ వినియోగంతో ప‌క్షి జాతి అంత‌రించిపోతోంది. అందుకే ఈ దుర్మార్గ‌పు ప్ర‌పంచంపై దాడి చేసేందుకు శంక‌ర్ ప్ర‌యోగిస్తున్న ప‌క్షి రాజు ఈయ‌న‌. పేరు క్రోమ్యాన్. చేతిలో సెల్‌ఫోన్ లాక్కుని విధ్వ ంశం సృష్టించ‌డం .. క‌క్ష తీర్చుకోవ‌డం ఆయ‌న వృత్తి. భూమ్మీద ప‌క్షిరాజు సాగించే విధ్వ ంశం ఏంటి? అన్న‌ది ఈనెల 29న వ‌స్తున్న 2.ఓ చిత్రంలో చూడాల్సిందే. ఈ మేక‌ప్ కోసం రోజూ 5 గంట‌లు శ్రమించాన‌ని 3గంట‌ల పాటు మేక‌ప్ వేస్తే, అది తొల‌గించేందుకు 2గంట‌లు ప‌ట్టేద‌ని, 28 ఏళ్ల‌లో ఇలాంటి శ్ర‌మ చూడ‌లేద‌ని క్రోమ్యాన్ పాత్ర‌ధారి అక్ష‌య్ తెలిపారు. ఇంత‌కీ క్రోమ్యాన్‌ని ఢీకొట్టేది ఎవ‌రు? అంటే చిట్టీ ద రోబోట్ 2.ఓ రీలోడెడ్‌. క్రోమ్యాన్‌తో చిట్టీ వార్ వీక్షించేందుకు కోట్లాది మంది వెయిటింగ్.