షాక్.. స్టార్ హీరోకి లైంగిక వేధింపులు

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ మధ్య వరుస హిట్స్ తోనూ, క్రేజీ ప్రాజెక్ట్స్ తోనూ, చిన్న చిన్న వివాదాలతోనూ వార్తల్లో ఎక్కువగా నిలుస్తోన్న విషయం తెలిసే ఉంటుంది. అయితే, ఇప్పటివరకు ఎలా ఉన్నా.. తాజాగా ఓ విషయంలో అక్షయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మాత్రం జనాల మైండ్ లో అలా ఫిక్స్ అయిపోతాయేమో అనిపిస్తోంది. అంతలా అక్షయ్ ఏం చెప్పాడంటే.. తనపై కూడా లైంగిక వేధింపులు జరిగాయని. ఇప్పటివరకు నటీమణులు, యంగ్ హీరోయిన్స్ మాత్రమే ఇలా తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తుంటే, తాజాగా అక్షయ్ తన గత జీవితంలోని ఓ షాకింగ్ సంఘటనను వివరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

అసలు విషయంలోకి వెళితే, తాజాగా ముంబైలో మానవ అక్రమ రవాణా అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా తన ప్రసంగంలో అక్షయ్ కుమార్ తన చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన గురించి అందరికీ చెబుతూ.. నా చిన్నప్పుడు మేముండే అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లో వెళుతుంటే పక్కనే ఉన్న లిఫ్ట్ బాయ్ నన్ను ఎక్కడ పడితే అక్కడ తాకేవాడని, ఈ విషయాన్ని వెంటనే అమ్మానాన్నలకు చెబితే వాళ్ళు అతడిని హెచ్చరించి వదిలేశారని, తర్వాత అతడు ఇలాంటి కేసులోనే జైలుకు కూడా వెళ్లాడని, అందుకే తల్లిదండ్రులు ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అంతేకాకుండా పిల్లలు కూడా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే పెద్దవాళ్లకు చెప్పాలని, అప్పుడే ఇలాంటి పనులకు పాల్పడే వాళ్లకు బుద్ధి చెప్పగలం అని అక్షయ్ కుమార్ సూచించారు.

Follow US