అక్ష‌య్ కుమార్.. బాబు బంగారం..!

Last Updated on by

తెలుగులో వెంక‌టేశ్ బాబు బంగారం చేసాడు క‌దా.. నిజానికి ఆ టైటిల్ అక్ష‌య్ కుమార్ కు బాగా సూట్ అవుతుంది. బాలీవుడ్ లో ఈయ‌న చేసిన‌న్ని ప్ర‌యోగాలు ఈ మ‌ధ్య కాలంలో మ‌రే స్టార్ హీరో చేయ‌లేదు. తాజాగా ఈయ‌న న‌టిస్తున్న గోల్డ్ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. పీప్లీలైవ్ లాంటి సామాజిక నేప‌థ్యం ఉన్న సినిమా తెర‌కెక్కించిన రీమాఖ‌గ్టీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుంది. 1948.. స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌ర్వాత మ‌న దేశం గెలిచిన తొలి ఒలంపిక్ స్వ‌ర్ణ ప‌థ‌కం నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా ఇది. హాకీ జ‌ట్టు ఇండియాకు తొలి బంగారు ప‌థకాన్ని తీసుకొచ్చింది. అప్ప‌టి వ‌ర‌కు గెలిచిన ప‌థ‌కాల‌న్నీ బ్రిటీష్ ఖాతాలోకి వెళ్లాయి.

ఇది మాత్రం మ‌న దేశం త‌రఫున వ‌చ్చిన తొలి ప‌థ‌కం. అందుకే ఈ నేప‌థ్యంలోనే సినిమా వ‌స్తుందిప్పుడు. ఈ టీజ‌ర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండ‌బోతుందో అర్థ‌మైపోతుంది. ఆగ‌స్ట్ 15న గోల్డ్ విడుద‌ల కానుంది. ఇప్పుడు విడుద‌లైన టీజ‌ర్ లో కూడా దేశ‌భ‌క్తిని బాగానే ర‌గిల్చాడు అక్ష‌య్ కుమార్. అంతా బ్రిటీష్ జెండాలు.. వాళ్ల ఆంథ‌మ్ లు పాడుతుంటే ఒక్క అక్ష‌య్ మాత్ర‌మే త‌న గుండెల్లోంచి జాతీయ జెండాను బ‌య‌టికి తీస్తాడు.. తీసి సెల్యూట్ చేస్తాడు. ఈ టీజ‌ర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండ‌బోతుందో అర్థ‌మైపోతుంది. క‌చ్చితంగా మ‌రో హిట్ అక్ష‌య్ కుమార్ ఖాతాలోకి వ‌చ్చేటట్లే క‌నిపిస్తుంది. మ‌రి చూడాలిక‌.. గోల్డ్ తో నిజంగానే అక్ష‌య్ కుమార్ ఈడు గోల్డ్ ఎహే అనిపించుకుంటాడో లేదో..?

User Comments