బాత్రూమ్‌లో దూరొద్దు ప్లీజ్‌!

Last Updated on by

ఒక టీనేజీ గాళ్ ఇంత మాటంటుందా? అని కంగారు ప‌డిపోవ‌ద్దు. అంత మాట అనాల్సొచ్చిందంటే ఆ వెన‌క ఎంత జ‌రిగిందో తెలుసుకోవాలి? ఇంత‌కీ ఎవ‌రీ ముద్దుగుమ్మ‌? అస‌లేం జ‌రిగింది? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

బాలీవుడ్‌లో యువ‌క‌థానాయిక ఆలియాభ‌ట్ ఎఫైర్ల క‌హానీ గురించే ఇదంతా. ఆలియా ఎఫైర్ల గురించి మీడియా ఎప్ప‌టిక‌ప్పుడు ర‌చ్చ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. న‌వ‌త‌రంలో యంగెస్ట్ హీరోయిన్ కాబ‌ట్టి త‌న‌పై ఈ త‌ర‌హా క‌హానీలు త‌ప్ప‌నిస‌రి. ఇదివ‌ర‌కూ యంగ్ హీరో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా నుంచి విడిపోయిన ఆలియా ప్ర‌స్తుతం ర‌ణ‌బీర్ క‌పూర్‌తో ప్రేమ‌లో ప‌డింద‌న్న రూమ‌ర్లు పుట్టుకొచ్చాయి. ఇది నిజ‌మా? అని ప్ర‌శ్నిస్తే ఆలియా చాలా సింపుల్‌గా న‌వ్వేస్తూ.. త‌న‌దైన శైలిలో స్ప ందించింది. న‌టించేప్పుడు ఆన్ లొకేష‌న్ నాకు ఎఫైర్ల గురించి వినిపించదు, క‌నిపించ‌దు. న‌ట‌న తప్ప వేరొక వ్యాప‌క‌మే లేదు. న‌ట‌న అన్న వ్యాప‌కం త‌ప్ప వేరొక‌ యావ‌గేష‌న్ ద‌రి చేర‌నివ్వ‌న‌ని క్లారిటీనిచ్చింది. ఇక రణ‌బీర్ గురించి ఇదివ‌ర‌కూ మాట్లాడుతూ అత‌డు ఓ ప‌క్కా జెంటిల్‌మేన్ అని పొగిడేసిన ఆలియా ఇలాంటి రూమ‌ర్ల‌కు స్ప ందించ‌న‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. ప‌ర్స‌న‌ల్ లైఫ్‌తో పాటు కెరీర్ ప‌రంగా బెస్ట్ ఫేజ్‌లో ఉన్నాన‌ని తెలిపింది. వ్య‌క్తిగ‌త విష‌యాల్లో త‌ల‌దూర్చొద్ద‌ని, మ‌రీ బాత్రూమ్‌లో దూరొద్దు ప్లీజ్‌!! అంటూ త‌న‌దైన శైలిలో మీడియాపై పంచ్ వేసింది ఆలియా.

User Comments