అల్ల‌రోడు తిర‌గ‌మోత ఎప్పుడు?

Last Updated on by

గ‌త కొంత‌కాలంగా అల్ల‌రి న‌రేష్ కెరీర్ పూర్తి డైలెమాలో ఉన్న సంగ‌తి తెలిసిందే. బంధిపోటు, జేమ్స్ బాండ్‌, సెల్పీ రాజా, ఇంట్లో దెయ్యం నాకే భయం, మేడ మీద అబ్బాయి.. అన్నీ వ‌రుస ప‌రాజ‌యాలు. దీంతో అత‌డిపై తీవ్రంగా ఒత్తిడి పెరిగింది. ఈసారి ఎట్టి ప‌రిస్థితిలో హిట్టు కొట్టి తీరాల్సిన స‌న్నివేశంలో అత‌డు సుడిగాడు ఫేం భీమ‌నేని శ్రీ‌నివాస‌రావుతో క‌లిసి ఓ రీమేక్‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది సునీల్- న‌రేష్ మ‌ల్టీస్టార‌ర్.

ఈ మ‌ల్టీస్టార‌ర్ జ‌న‌వ‌రిలో మొద‌లై చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంద‌ని తెలుస్తోంది. త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ `త‌మిజ్‌ ప‌దం 2.0` కి రీమేక్‌. `సుడిగాడు` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి బంప‌ర్ హిట్ అందుకోవాల‌నే ప్ర‌య‌త్న‌మిద‌ని చెబుతున్నారు. టాలీవుడ్‌లో అత్యంత వేగంగా 50 సినిమాలు పూర్తి చేసిన న‌రేష్ కెరీర్ ఇటీవ‌ల ఊహించ‌ని మ‌లుపు తిరిగింది. ఆ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌ళ్లీ పూర్వ వైభ‌వం తేవాల్సిన స‌న్నివేశంలో భీమ‌నేని అతడికి ఆశించిన‌ది ఇస్తాడ‌నే కోరుకుందాం. ఇక ఈ సినిమా త‌ర్వాత ర‌విబాబు నిర్ధేశ‌నంలో అల్ల‌రి 2 కూడా ఉంటుంద‌న్న స‌మాచారం ఉంది. అయితే కెరీర్‌లో ఎన్నో ప్ర‌యోగాలు చేసిన న‌రేష్ అన్నిచోట్లా దెబ్బ తిన్నాడు. ఈసారి ప్ర‌యోగం చేస్తే ష్యూర్ షాట్ హిట్ ప‌డాలి. అప్పుడే అత‌డికి వేగంగా 100 సినిమాలు పూర్తి చేసే ఛాన్సుంటుంది. నేడు న‌రేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా హ్యాపీ బ‌ర్త్ డే.

User Comments