మ‌హేష్ 25లో న‌రేష్ పాత్ర‌?

Last Updated on by

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ – వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌ సినిమాపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మ‌హేష్ త‌న కెరీర్ ల్యాండ్‌మార్క్ 25వ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈనెల 10 నుంచి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళుతున్నామ‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ఓ కీల‌క‌పాత్ర పోషించ‌నున్నాడు. అయితే మ‌హేష్, న‌రేష్ పాత్ర‌ల తీరుతెన్నులు ఏంటి? అన్న‌దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఆ ఇద్ద‌రూ స్నేహితులుగా న‌టిస్తున్నార‌ని తెలుస్తోంది. స్నేహితులు అంటే మామూలు స్నేహితులు కాదు. మ‌హేష్ ఓ నిరుపేద‌గా న‌టిస్తుంటే, అల్ల‌రి న‌రేష్ ధ‌నికుడిగా క‌నిపిస్తాడ‌ట‌. వాస్త‌వానికి మ‌హేష్ ధ‌నికుడిగా, న‌రేష్ పేద‌వాడిగా క‌నిపిస్తాడ‌ని అంతా అంచ‌నా వేస్తాం. కానీ అందుకు పూర్తి భిన్నంగా కృష్ణుడు- కుచేలుడు త‌ర‌హా పాత్ర‌ల్లో ఆ ఇద్ద‌రూ న‌టిస్తుండ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. మ‌హేష్ త‌న పాత్ర‌కు త‌గ్గ‌ట్టు ఇప్ప‌టికే గెట‌ప్ మార్చేశాడు. ఇటీవ‌లే విమానాశ్ర‌యంలో గ‌డ్డం పెంచి న్యూలుక్‌తో క‌నిపించి షాకిచ్చాడు. మ‌హేష్ పేద‌వాడిగా క‌నిపించ‌డం అన్న ఆలోచ‌నే సాహ‌సం అనుకుంటే… మారిన లుక్ ఇంకా ఛాలెంజింగ్‌గా క‌నిపిస్తోంది. అంతేకాదు… రైతు స‌మ‌స్య‌ల చుట్టూ తిరిగే ఈ సినిమాలో చాలానే ఎమోష‌న్ ఉంటుందని .. మ‌హేష్ ఒక రైతు బిడ్డ‌గా న‌టిస్తున్నాడ‌ని చెబుతున్నారు. అమెరికా నుంచి ఇండియాకి మారే క‌థ‌తో వంశీ పైడిప‌ల్లి చాలానే జిమ్మిక్కులు చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో షాలిని పాండే పాత్ర మ‌రో హైలైట్‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌హేష్ డెబ్యూ సినిమా రాజ‌కుమారుడు తీసిన అశ్వ‌నిద‌త్ ఇన్నాళ్టికి మ‌రోసారి మ‌హేష్ సినిమా అన‌గానే క‌సిగా ఉన్నారుట‌. నైజాం కింగ్ దిల్‌రాజుతో క‌లిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

User Comments