సునీల్.. న‌రేష్.. సిల్లీఫెల్లోస్

Last Updated on by

డోలు వ‌చ్చి మ‌ద్దెల‌తో త‌న గోడు చెప్పుకుందంట‌.. ఇప్పుడు ఇలాగే ఉంది అల్ల‌రి న‌రేష్, సునీల్ ప‌రిస్థితి చూస్తుంటే. ఇద్ద‌రి కెరీర్స్ ఇప్పుడు ఒకే ర‌కంగా ఉన్నాయి. ఎవ‌రి ప‌డ‌వ ఎప్పుడు మునిగిపోతుందో తెలియ‌దు. తీరం తెలియ‌క తిక్క‌చూపులు చూస్తున్నారు ఈ హీరోలిద్ద‌రూ ఇప్పుడు. సునీల్ అయితే ఏకంగా హీరోగా మానేసి క‌మెడియ‌న్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక అల్ల‌రి న‌రేష్ కూడా హీరోగా ఒక్క హిట్ అంటూ వేచి చూస్తున్నాడు. ఒక‌టి రెండు కాదు.. దాదాపు వ‌ర‌స‌గా 10 ఫ్లాపులు ఇచ్చాడు న‌రేష్. మ‌రోవైపు సునీల్ సైతం వ‌ర‌స‌గా అడ‌ర‌జ‌న్ ఫ్లాపులు దాటేసాడు. ఇలాంటి టైమ్ లో ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్నారు. భీమినేని శ్రీ‌నివాస‌రావ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్ల‌రి న‌రేష్, సునీల్ హీరోలుగా సిల్లీఫెల్లోస్ సినిమా మొద‌లైంది. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జ‌రుగుతుందిప్పుడు. ఈ చిత్రం ఖచ్చితంగా ఇద్ద‌రి కెరీర్స్ కు కీల‌క‌మే. మ‌రోవైపు భీమినేని కూడా సుడిగాడు త‌ర్వాత ఒక్క హిట్ కూడా కొట్ట‌లేదు. దాంతో ఎటువైపు చూసుకున్నా ఈ చిత్రం అంద‌రికీ కీల‌కంగా మారింది. అప్ప‌ట్లో సునీల్, అల్ల‌రి న‌రేష్ క‌లిసి తొట్టిగ్యాంగ్ లో న‌టించారు. ఇప్పుడు ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ క‌లిసి న‌టిస్తున్నారు హీరోలుగా. మ‌రి చూడాలిక‌.. ఈ ఇద్ద‌రి జ‌ర్నీ ఎలా సాగ‌నుందో.. సిల్లీఫెల్లోస్ ఇద్ద‌రూ క‌లిసి ఏం చేయ‌బోతున్నారో..?

User Comments