పవన్ కి పోటీగా అల్లు అరవింద్ గ్యాంగ్

అవును.. ఇప్పుడు ఇదే అనిపిస్తుంది ప‌రిస్థితులు చూస్తుంటే. పండ‌క్కి ప‌వ‌న్ వ‌స్తుంటే ఓ అర‌వ హీరో ఎలా ధైర్యం చేస్తాడు రాడానికి..! పైగా ఆయ‌న‌కి 350 స్క్రీన్స్ ఎక్క‌డ్నుంచి వ‌చ్చాయి.. గ్యాంగ్ సినిమా విడుద‌ల‌వుతుంటే ఇప్పుడు అంద‌ర్లోనూ వ‌స్తోన్న అనుమానాలివే. కానీ దీని వెన‌క ఉన్న హ‌స్తం మాత్రం అల్లు అర‌వింద్ అని తెలుస్తుంది. ఈయ‌నే గ్యాంగ్ సినిమాను తెలుగులో అనుకున్న టైమ్ కు విడుద‌ల‌య్యేలా చేసాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకే ప్రీ రిలీజ్ వేడుక‌లో అల్లుఅర‌వింద్ కు ప్ర‌త్యేక కృత‌జ్ఞతలు కూడా చెప్పాడు సూర్య‌. అంటే సూర్య సినిమాను ఇంత ధైర్యంగా విడుద‌ల చేస్తున్నారంటే.. అజ్ఞాత‌వాసి తేడా కొడుతుంద‌ని ముందే అల్లు అర‌వింద్ కు తెలుసా..? అందుకే సూర్య‌ను రంగంలోకి దింపాడా..? ఏదేమైనా ఇప్పుడు సూర్యకు వ‌రంగా మారింది ఈ సంక్రాంతి.

పండ‌క్కి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏదో చేస్తాడ‌నుకుంటే ఏమీ చేయ‌కుండానే వెళ్లిపోతున్నాడు. దాంతో మిగిలిన హీరోల‌కు ఇప్పుడు రెక్క‌లొచ్చేస్తున్నాయి. ప‌వ‌ర్ స్టార్ సైడ్ ఇవ్వ‌డంతో వ‌చ్చినోళ్లంతా నిజంగానే పండగ చేసుకోవాల‌ని చూస్తున్నారు. ఇప్ప‌టికే బాల‌య్య జై సింహాగా వ‌స్తున్నాడు. మ‌రోవైపు సూర్య కూడా త‌న‌కు అనుకోకుండా వ‌చ్చిన ఈ వరాన్ని చూసి గాల్లో తేలిపోతున్నాడు. క‌చ్చితంగా ఈ చిత్రంతో తెలుగులో విజ‌యం సాధించాల‌ని చూస్తున్నాడు సూర్య‌. ఈ చిత్రంలో ఆయ‌నే స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పుకున్నాడు. కార్తితో పోటీ ప‌డాలంటే ఇప్పుడు సూర్య‌కు ఈ డ‌బ్బింగ్ బెడ‌ద త‌ప్ప‌డం లేదు. హిందీ సినిమా స్పెష‌ల్ 26కి రీమేక్ గా ఇది తెర‌కెక్కింది.

గ్యాంగ్ టీజ‌ర్ చూస్తుంటే సినిమా క‌చ్చితంగా కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తుంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ రేస్ నుంచి త‌ప్పుకున్నాడు కాబ‌ట్టి ఇప్పుడు సూర్య పోటీ అంతా బాల‌య్య‌తోనే. ఈయ‌న్ని త‌ట్టుకుని సూర్య గ్యాంగ్ ఎంత‌వ‌ర‌కు నిల‌బడుతుంది అనేది ఆస‌క్తిక‌రంగా మారిందిప్పుడు. గ‌త ఏడేళ్ల‌లో సింగం.. సింగం 2 త‌ప్ప మ‌రో హిట్ లేదు ఈ హీరోకు. మొన్నొచ్చిన సింగం 3 కూడా స‌రిగ్గా ఆడ‌లేదు. దాంతో ఇప్పుడు గ్యాంగ్ సినిమాపై భారీ ఆశ‌లే ఉన్నాయి. ఈ సినిమా తెలుగులో విడుద‌ల అవ్వడానికి నుం రౌడిధానుం త‌ర్వాత విఘ్నేష్ శివ‌న్ చేసిన‌ సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై అంచ‌నాలు కూడా భారీగా ఉన్నాయి. కీర్తిసురేష్ హీరోయిన్. చూడాలిక‌.. ఈ గ్యాంగ్ లీడ‌ర్ ఎలా ఉండ‌బోతున్నాడో..!

User Comments