జ‌గ‌మంత కుటుంబం నాది

స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతం అని అనాల్సిందే ఈ ఫోటో చూశాక‌. లేదంటే.. జ‌గ‌మంత కుటుంబం నాది! అని ఓమారు `చ‌క్రం` సినిమాలోని పాట‌ను గుర్తు చేసుకోవాలి. అల్లు వారి పెద్ద‌బ్బాయ్ బ‌న్ని ప‌క్కా హ్యాపీ ఫ్యామిలీమేన్ అన్న సంగ‌తి తెలిసిందే. వీలున్న‌ప్పుడ‌ల్లా ఇదిగో ఇలా స‌తీమ‌ణి స్నేహారెడ్డితో క‌లిసి చ‌క్క‌గా ఫ్యామిలీ వెకేష‌న్లు, రెస్టారెంట్ విజిట్లు ప్లాన్ చేస్తుంటాడు. ఫారిన్ ట్రిప్‌ల‌కు అయితే కొద‌వే ఉండ‌దు. ఈసారి ప‌చ్చ‌ని కొండ ఏరియాల్లో ట్రెక్కింగ్ కూడా చేశారు వీళ్లంతా.

ఈ గుంపులో చిన్నారి అల్లు ఆయాన్, అల్లు అర్హ‌ ఇద్ద‌రూ ఉన్నారు. క‌నిపెట్టండి చూద్దాం.. దాగుడు మూత‌ల దండాకోర్‌.. ! క‌నిపెడ‌తారా మ‌మ్మ‌ల్ని చోర్! అంటూ మారు వేషాల్లో క‌నిపిస్తున్నారు. కాస్త ప‌రిశీల‌న‌గా చూస్తే క‌నిపెట్టేయొచ్చు. మిగ‌తా పిల్ల‌లంతా క‌జిన్ కిడ్స్ అని అర్థ‌మ‌వుతోంది. స్నేహారెడ్డి స్వ‌యంగా `సండేబ్రంచ్‌` అంటూ క్లూ ఇచ్చారు కాబ‌ట్టి.. ఆదివారం నాడు ఓ మాంచి స్టార్ హోట‌ల్లో లంచ్‌కి వెళ్లార‌న్న‌మాట‌. అక్క‌డే ఈ ఫోటోని త‌ళుక్కుమ‌నిపించారు.