అట్ట‌సూడ‌కే.. అంటున్న అల్లు అర్జున్

వాలెంటైన్ డే రోజు త‌న అభిమానుల‌కు ప్రేమ కానుక ఇచ్చాడు అల్లుఅర్జున్. నా పేరు సూర్య‌లోని రెండో పాట విడుద‌లైంది. ఇందులో త‌న ప్రేయ‌సి చూపులకు బంధీ అయిపోయాడు బ‌న్నీ. ఇప్ప‌టి వ‌ర‌కు సైనికా అంటూ దేశ‌భ‌క్తి పాట‌లు పాడుకున్న బ‌న్నీ.. ఇప్పుడు ప్రేమ‌పాఠాలు చెప్తున్నాడు. ఈ పాట‌లో అను ఎమ్మాన్యువ‌ల్ చూపులు చూసి బ‌న్నీ ఏంటి.. ప్ర‌వరాఖ్యుడైనా ప‌డిపోవాల్సిందే. అంత‌గా మ‌త్తెక్కించే చూపుల‌తో మాయ చేస్తుంది అను ఎమ్మాన్యువ‌ల్. అందుకే సూడ‌కే.. అట్ట సూడ‌కే అంటూ బ‌న్నీ కూడా ఓ పాటందుకున్నాడు. సైనికాలో దేశ‌భ‌క్తి క‌నిపిస్తుంటే.. ఈ పాట‌లో ప్రేమ త‌త్వం బాగా భోద‌ప‌డింది.

ఈ పాట‌లో కూడా ఓ సోల్జ‌ర్ ప్రేమ‌లో ప‌డితే ఎలా ఉంటుందో.. లిరిక్స్ కూడా అలాగే రాయించుకున్నాడు వ‌క్కంతం వంశీ. స‌రిహ‌ద్దులు తెంచుకుని నీ వ‌ద్ద‌కు రానా అంటూ ప్రేయ‌సిని ఉద్దేశించి పాడుతున్నాడు బ‌న్నీ. విశాల్ శేఖ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ పాట‌తో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెర‌గ‌డం ఖాయం. సినిమా షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. ఫిబ్ర‌వరి 15 వ‌ర‌కు ఈ చిత్ర క్లైమాక్స్ జ‌ర‌గ‌నుంది. మొత్తానికి ఒక‌టి దేశ‌భ‌క్తి.. మ‌రోటి ప్రేమ‌ముక్తి పాట‌లైపోయాయి. త‌ర్వాత ఎలా ఉండ‌బోతున్నాయో..?

User Comments