తిట్టిన నోళ్లతోనే పొగుడుతున్నారు

స‌రిగ్గా 15 ఏళ్ల కింద ఓ హీరో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు. ఆయ‌న వ‌చ్చిన‌పుడు ఎవ‌రీ కుర్రాడు ఇలా ఉన్నాడు..? బ‌్యాగ్రౌండ్ ఉంటే ఎలా ఉన్నా హీరో అయిపోవ‌చ్చా..? ప‌్రేక్ష‌కుల ముందుకు తోసేసి.. వాళ్లపైకి రుద్దేస్తారా..? అంటూ చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. బ‌హుశా తెలుగులో ఏ వార‌సుడిపై కూడా ఈ స్థాయి విమ‌ర్శ‌లు రాలేదు. కానీ అల్లు అర్జున్ పై వ‌చ్చాయి. గంగోత్రి విడుద‌ల అయిన‌పుడు చాలా మంది తిట్టారు కూడా. కానీ అప్పుడు తిట్టిన నోళ్లే ఇప్పుడు ఆ హీరోను చూసి వావ్ అంటున్నాయి. అత‌డే అల్లుఅర్జున్.. వ‌న్ అండ్ ఓన్లీ స్టైలిష్ స్టార్ ఆఫ్ తెలుగు ఇండ‌స్ట్రీ. ఈయ‌న తొలి సినిమా గంగోత్రి విడుద‌లై మార్చ్ 28కి స‌రిగ్గా 15 ఏళ్లైంది. 2003.. మార్చ్ 28న విడుద‌లైంది ఆ సినిమా. ద‌ర్శ‌కేంద్రుడి చేతుల మీదుగా అశ్వినీద‌త్ ఆశీస్సుల‌తో వ‌చ్చాడు అల్లు అర్జున్. ఈ చిత్రం హిట్టైనా కూడా పెద్ద‌గా గుర్తింపు అయితే రాలేదు. కానీ 2004లో వ‌చ్చిన ఆర్య‌తో స్టార్ అయ్యాడు అల్లు అర్జున్. సుకుమార్ తొలి సినిమా ఇది. ఆర్య‌తో బాగా మేకోవ‌ర్ అయ్యాడు అల్లుఅర్జున్.

ఆర్య సినిమా త‌ర్వాత విమ‌ర్శించిన వాళ్లే అబ్బో కుర్రాడిలో క‌సి ఉందిరా అంటూ పొగిడారు. టాలీవుడ్ బెస్ట్ డాన్స‌ర్ గా అప్ప‌ట్లోనే చిరంజీవితో ప్ర‌శంస‌లు అందుకున్నాడు బ‌న్నీ. ఇక మూడో సినిమా బ‌న్నీతో హ్యాట్రిక్ పూర్తి చేసాడు అల్లు అర్జున్. తొలి మూడు సినిమాల‌తో వ‌ర‌స హిట్లు అందుకున్న అతికొద్ది మంది హీరోల్లో అల్లుఅర్జున్ కూడా ఒక‌రు. వెంట‌నే హ్యాపీ నిరాశ‌ప‌రిచినా.. దేశ‌ముదురుతో హిట్ కొట్టాడు. ఈ సినిమాతో తెలుగులో తొలి సిక్స్ ప్యాక్ హీరోగా చ‌రిత్ర సృష్టించాడు బ‌న్నీ. ఆ మ‌రుస‌టి ఏడాది ప‌రుగుతో త‌న న‌ట‌న‌ను చూపించాడు. ఆర్య 2.. వ‌రుడు.. వేదం.. బ‌ద్రీనాథ్ లాంటి సినిమాలు బ‌న్నీ ఇమేజ్ ను దెబ్బతీసాయి. 2012లో జులాయి సినిమాతో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు అల్లుఅర్జున్. ఈ సినిమాతో తొలిసారి 40 కోట్ల క్ల‌బ్ లో అడుగుపెట్టాడు.

జులాయి త‌ర్వాత కూడా మ‌ళ్లీ ఫ్లాపులు అందుకున్న బ‌న్నీ.. 2014 నుంచి స్టైల్ మార్చుకున్నాడు. రేసుగుర్రం నుంచి బ‌న్నీకి గోల్డెన్ టైమ్ స్టార్ట్ అయిపోయింది. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి యావ‌రేజ్ టాక్ తోనే 50 కోట్లు వ‌సూలు చేసింది. ఇక రుద్ర‌మ‌దేవికి బ‌న్నీనే ప్రాణం అయ్యాడు. స‌రైనోడు ఈ హీరో మాస్ ప‌వ‌ర్ ఏంటో చూపించింది. డిజే కూడా నెగిటివ్ టాక్ తో ఓపెన్ అయి కూడా 70 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇప్పుడు బ‌న్నీకి 80 కోట్లు టార్గెట్. ప్ర‌స్తుతం ఈ హీరో నా పేరు సూర్యతో బిజీగా ఉన్నాడు. మే 4న ఇది విడుద‌ల కానుంది. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడు. ఈ 15 ఏళ్ల ప్ర‌యాణంలో తెలుగు వాళ్ళ‌తో పాటు మలయాళీ ప్రేక్ష‌కుల మ‌న‌సు కూడా దోచుకున్నాడు అల్లుఅర్జున్. అక్క‌డి వాళ్ల‌తో మ‌ల్లు అర్జున్ అని పిలిపించుకున్నాడు బ‌న్నీ. మొత్తానికి 15 ఏళ్ల జ‌ర్నీ అల్లుఅర్జున్ కు సంతృఫ్తినే ఇచ్చింది.