బన్నీ అమెరికా టూర్ క్యాన్సిల్.. కారణం అదే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రైటర్ నుంచి డైరెక్టర్ గా మారుతున్న వక్కంతం వంశీతో ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ సినిమా చేయడానికి అన్ని విధాలా రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసమే ముంబై వెళ్లి మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చుని మరీ అక్కడే బన్నీ హల్ చల్ చేస్తున్నాడని రీసెంట్ గా వార్తలు కూడా బాగానే వినిపించాయి. ఇదే సమయంలో ఈ నా పేరు సూర్యలో బన్నీ ఆర్మీ మ్యాన్ గా కనిపించనున్నాడు కాబట్టి.. దానికోసం ఫిజికల్ గా బాడీని సరికొత్తగా మార్చడానికి బన్నీ అమెరికా టూర్ ప్లాన్ చేశాడని న్యూస్ బయటకొచ్చింది. అంతేకాకుండా అక్కడే ఏకంగా ఓ 30 రోజుల పాటు ఉండి తన బాడీని ప్రత్యేకముగా మలుచుకోవాలని పక్కా ప్రణాళిక రెడీ చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అలాగే ఈ టూర్ పేరు చెప్పి మరోసారి ఎన్నారైలను కలవడానికి బన్నీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని కూడా తెలిపారు.

అయితే, ఇప్పుడు తాజాగా ఈ బన్నీ అమెరికా టూర్ క్యాన్సిల్ అయిందని టాక్ బయటకు రావడం ఒక్కసారిగా చర్చనీయాశం అయింది. అందులోనూ అల్లు అరవింద్ సీన్ లోకి ఎంటర్ అయ్యాకే ఈ టూర్ ప్లానింగ్ మారిపోయిందని పేర్కొంటూ న్యూస్ బయటకు రావడం ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది. అసలు విషయంలోకి వెళితే, బ్యాచ్ అంతా అమెరికా వెళ్లి అక్కడ బోలెడు డబ్బులు తగలేసే బదులు ఆ ఫిజికల్ ట్రైనర్ ను ఇక్కడికే పిలిస్తే సరిపోతుంది కదా అంటూ తాజాగా అల్లు అరవింద్ సలహా ఇచ్చారట. దీంతో బన్నీ అమెరికా టూర్ ను క్యాన్సిల్ చేశారని ప్రస్తుతం చెప్పుకొస్తున్నారు. ఈ కారణంగా ఇక్కడే ఉంటూ బన్నీ తన బాడీని మెరుగులు దిద్దుకోవడమే కాకుండా నిర్మాతలతో కూర్చుని సినిమాని పక్కా ప్లానింగ్ తో ముందుకు తీసుకెళ్తాడని అంటున్నారు. ఎందుకంటే, ఈ సినిమాకు ఒక నిర్మాతగా మెగా బ్రదర్ నాగబాబు వ్యవహరిస్తుండటమేనని చెబుతున్నారు.

Follow US