బ‌న్నీకి షాక్ ట్రీట్మెంట్ పని చేసిందే..!

Last Updated on by

రెండేళ్ల కింద బ‌న్నీ ఇలా లేడు. స‌రైనోడు స‌క్సెస్ త‌ర్వాత ఆయ‌న‌లో మార్పు వ‌చ్చింది. మెగా కుటుంబాన్ని కూడా దూరంగా ఉంచాడ‌నే వార్త‌లున్నాయి. మ‌రీ ముఖ్యంగా సొంత కుంప‌టి పెట్టుకోవాల‌ని చూసాడు. అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని కూడా ప‌ట్టించుకోలేద‌నే ప్ర‌చారం జరిగింది. ఈయ‌న చేసిన చెప్ప‌ను బ్ర‌ద‌ర్ కామెంట్స్ కూడా దీనికి నిద‌ర్శ‌న‌మే. ఆ త‌ర్వాత కూడా చాలా సార్లు ప‌వ‌న్ గురించి చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అని అభిమానుల కోపానికి బ‌ల‌య్యాడు కూడా. అయితే ఇప్పుడు బ‌న్నీలో కావాల్సినంత మార్పు వ‌చ్చింది. ఎందుకో తెలియ‌దు కానీ ఇప్పుడు మెగా బంధం కోసం పాకులాడుతున్నాడు అల్లు అర్జున్. మొన్న ఫిల్మ్ ఛాంబ‌ర్ ద‌గ్గ‌ర ప‌వ‌న్ ను ఆప్యాయంగా హ‌త్తుకోవ‌డం కానీ.. ఆ త‌ర్వాత నా పేరు సూర్య ఆడియో వేడుక‌లో ప‌వ‌న్ ను తెగ పొగిడేయడం కానీ చూస్తుంటే ప‌వ‌న్ విలువ ఇప్ప‌టికి తెలిసొచ్చిందా అనిపిస్తుంది. లేదంటే మెగా కుటుంబంతో సున్నం పెట్టుకోవ‌డం మంచిది కాదేమో అని బ‌న్నీకి అర్థ‌మై అయినా ఉండాలంటున్నారు విశ్లేష‌కులు.

ఏదేమైనా ఇప్పుడు మెగా హీరోల‌ను క‌లుపుకోడానికి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు అల్లు అర్జున్. మ‌రోవైపు అల్లు అరవింద్ కూడా త‌మ‌కు ప‌వ‌న్ త‌ర్వాతే ఎవ‌రైనా అంటున్నాడు. ఇప్పుడు నా పేరు సూర్య ప్రీ రిలీజ్ వేడుక‌కు రామ్ చ‌ర‌ణ్ ను అతిథిగా తీసుకొస్తున్నాడు బ‌న్నీ. ఏప్రిల్ 29న గ‌చ్చిబౌలి స్టేడియంలో ఈ వేడుక జ‌ర‌గ‌బోతుంది. మొన్న ఆడియో వేడుక‌లో చ‌ర‌ణ్ కు స‌భాముఖంగా కంగ్రాట్స్ చెప్పాడు రంగ‌స్థ‌లం స‌క్సెస్ కు. బ‌న్నీలో వ‌చ్చిన ఈ మార్పు చూసి అంతా షాక్ అవుతున్నారు. అభిమానులు అయితే సంతోష ప‌డుతున్నారు. బ‌న్నీ కూడా తాము ఎంత‌మంది హీరోలున్నా కూడా అంద‌రం ఒక్క‌టే.. అంతా క‌లిసే ఉంటాం.. మేమంతా ఒకే కుటుంబం అంటూ చెప్పుకొచ్చాడు. మ‌రి తెర‌వెన‌క ఏ శ‌క్తి ప‌నిచేసిందో తెలియ‌దు కానీ అల్లు వారబ్బాయి మాత్రం అస‌లు గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయాడిప్పుడు.

User Comments