మ‌ర‌ద‌లితో మ‌స్త్ పోజిచ్చిన బ‌న్నీ

నా పేరు సూర్య త‌ర్వాత ఏ సినిమా ఒప్పుకోలేదు అల్లుఅర్జున్. ప్ర‌స్తుతానికి కుటుంబంతోనే ఎంజాయ్ చేస్తున్నాడు ఈ హీరో. తాజాగా మెగా మ‌ర‌ద‌లితో క‌లిసి ఈయ‌న ఇచ్చిన పోజ్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగానే వైర‌ల్ అవుతుంది. చిరంజీవి కూతుళ్ల‌తో కూడా బ‌న్నీకి అనుబంధం బాగానే ఉంది. పైగా చిన్న‌ప్ప‌ట్నుంచీ అంతా క‌లిసే పెరిగారు క‌దా.. దాంతో అంతా ఒక‌రికి ఒక‌రు అన్న‌ట్లుగా ఉంటారు. ఇప్పుడు చిరు పెద్ద కూతురు సుష్మిత‌తో చుట్ట కాలుస్తూ కుర్చీలో కూర్చుని అదిరిపోయే పోజిచ్చాడు బ‌న్నీ. సుష్మిత కూడా బావ‌తో చిరున‌వ్వుతో అలా మెరిసిపోయింది. ఈ లుక్ ఇప్పుడు బాగానే వైర‌ల్ అవుతుంది. బ‌న్నీ ప్ర‌స్తుతం ఇద్ద‌రు ముగ్గురు ద‌ర్శ‌కుల‌తో మంత‌నాలు న‌డుపుతున్నాడు. మ‌రి.. ఇందులో ఏది ఫైన‌ల్ అవుతుందో..?

allu arjun cigar pose chiranjeevi daughter sushmita konidela

User Comments