గారు అనాలి.. బ‌న్ని కోటింగ్

గారు.. గారు.. అంటూ బాగానే కోటింగ్ ఇచ్చాడు బ‌న్ని. నేటి సాయంత్రం `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` ప్రీరిలీజ్ ఈవెంట్ సాక్షిగా.. సెల‌బ్రిటీల్ని, పెద్ద స్థాయిలో ఉన్న వారిని అరేయ్.. ఒరేయ్ .. అంటూ అవ‌మాన ప‌రుస్తూ మాట్లాడే వారంద‌రికీ బ‌న్ని ఓ రేంజులో కోటింగ్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఫిలింన‌గ‌ర్‌లో ఇదో హాట్ టాపిక్.

పెద్ద స్థాయి ఉన్న వాళ్ల‌ను పిలిచే పిలుపు ఇలాగేనా?  స్థాయిని బ‌ట్టి గౌర‌వించి మాట్లాడ‌డం.. గౌర‌వించి పిల‌వ‌డం నేర్చుకోవాలి.. అని బ‌న్నీ ఫుల్లుగా క్లాస్ తీస్కున్నాడు. రేయ్.. చిరంజీవి అని పిలిచాడు ఒక‌డు.. ఆ పిలుపేంట్రా.. చిరంజీవి గారు..! నేర్చుకోండి… ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు.. అని పిల‌వాలి…. రాజ‌కీయ నాయ‌కులు అయినంత మాత్రాన మీకెవ‌రికీ అలా పిలిచే హ‌క్కు ఇవ్వ‌లేదు.. పొలిటీషియ‌న్ అయినంత మాత్రాన త‌క్కువ చేసి మాట్లాడ‌కూడ‌దు…. పిలుపు గౌర‌వంగా ఉండాలి.. ఇప్ప‌టికైనా నేర్చుకుందాం.. అంటూ బ‌న్ని క్లాస్ తీస్కున్నాడు. అయితే బ‌న్ని అన్న‌ది ఓ ర‌కంగా వాస్త‌వ‌మే. ఎవ‌రిని బ‌డితే వాళ్ల‌ను అరేయ్ ఒరేయ్‌! అని కుసంస్కారంగా పిల‌వ‌డం స‌రికాదు క‌దా?  పైగా ఎంద‌రో సెల‌బ్రిటీలు రాజ‌కీయ రంగంలోకి వెళ్లాక అక్క‌డ అరేయ్.. అంటూ రూడ్‌గా పిలిచేయ‌డం బావుంటుందా? అందుకే బ‌న్ని ఇలా క్లాస్ తీస్కున్నాడ‌న్న‌మాట‌. ముఖ్యంగా చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లోనూ ఉన్నారు. అంత పెద్ద స్టార్ల‌ను, స్థాయి ఉన్న వాళ్ల‌నుద్ధేశించి ఎవ‌రైనా అలా పిలిచేస్తే కోపం రాకుండా ఉంటుందా?  ఇక ఇదే వేదిక‌పై శ‌ర్వానంద్‌ని ఉద్ధేశించి గారు అని పిలిచాడు బ‌న్ని. శ‌ర్వానంద్ గారు అని  పిల‌వ‌డానికి కార‌ణం మీరంతా త‌న‌ని గుండెల్లో పెట్టుకుని ఇంత పెద్ద వాడిని చేసి గౌర‌వించారు. అందుకే వేదికాముఖంగా గారు అని పిలుస్తున్నాను. ఇది మ‌నం నేర్చుకుందాం.. అని ప్రాక్టికాలిటీని చూపించాడు బ‌న్ని.