రాజ‌మౌళిని కాపీ కొడుతున్న బ‌న్నీ

Last Updated on by

ఇండ‌స్ట్రీలో న‌చ్చిన దాన్ని ఫాలో అయిపోతే కాపీ కొట్ట‌డం కాదు.. స్పూర్థి పొంద‌డం అంటారు. కాపీ అంటారు కానీ క్లాస్ గా మ‌నోళ్లు మాత్రం దానికి స్పూర్థి అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు అల్లుఅర్జున్ ఇదే చేస్తున్నాడు. ఈయ‌న రాజ‌మౌళిని కాపీ కొట్ట‌డానికి.. అదే ఆయ‌న నుంచి స్పూర్థి పొందడానికి సిద్ధమైపోయాడు. ఏప్రిల్ 29న నా పేరు సూర్య ప్రీ రిలీజ్ వేడుక గ‌చ్చిబౌలిలో జ‌ర‌గ‌బోతుంది. దీనికి రామ్ చ‌ర‌ణ్ ముఖ్యఅతిథిగా వ‌స్తున్నాడు. ఆ వేదిక‌పై మెగా కుటుంబానికి సంబంధించిన మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌న్నీ మాట్లాడ‌టానికి రెడీ అవుతున్నాడు. ఎలాగూ అదే వేదిక‌పై నాగ‌బాబు కూడా ఉంటాడు. కుదిర్తే చిరంజీవి కూడా జాయిన్ అవుతాడు. ఇవ‌న్నీ ఇలా ఉంటే ఈ రోజుల్లో ఆడియో వేడుక‌.. ప్రీ రిలీజ్ వేడుక అంటే ప్రేక్ష‌కులు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌ట్లేదు. పైగా ఇప్పుడు ఐపిఎల్ సీజ‌న్ న‌డుస్తుంది.

వాళ్ల దృష్టిని అక్క‌డ్నుంచి ఇక్క‌డికి మ‌ళ్లించాలంటే చిన్న విష‌యం కాదు. అలా చేయ‌డానికి ఇప్పుడు రాజ‌మౌళి నుంచి స్పూర్థి పొందాడు బ‌న్నీ. అదే ప్రీ రిలీజ్ వేడుక‌లో తన ఎంట్రీ. అవును.. బాహుబ‌లి 2 ఆడియో వేడుక గుర్తుందా.. అందులో ప్ర‌భాస్ గాల్లో నుంచి తేలుకుంటూ స్టేజ్ పైకి దిగిన సీన్ గుర్తుందా..? ఇప్పుడు అదే విధంగా జిమ్నాస్టిక్స్ తో దేశ‌భ‌క్తి థీమ్ పెట్టుకుని స్టేడియంలోకి రాబోతున్నాడు బ‌న్నీ. కేవ‌లం ఈ ఫీట్ కోస‌మే ఏప్రిల్ 29 వేడుక‌లో 20 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తున్నారు నిర్మాత‌లు. దీనికోసం బ‌న్నీ ప్ర‌త్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు కూడా. ఇక మిగిలిన వేడుక కూడా 80 ల‌క్ష‌ల‌తో చేస్తున్నాడు నిర్మాత ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్. ఖచ్చితంగా నా పేరు సూర్య ప్రీ రిలీజ్ వేడుక‌లో బన్నీ ఎంట్రీ అదిరిపోతుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రి.. అప్పుడు ప్ర‌భాస్ చేసిన‌ట్లుగా ఇప్పుడు బ‌న్నీ ఎంత‌వ‌ర‌కు మెప్పిస్తాడో త‌న ఫీట్ తో..!

User Comments