బన్నీ గోల్ మాల్ వెనుక పెద్ద కథే ఉందంట..!

Allu Arjun Golmaal Team Mumbai
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొన్నిరోజుల నుంచి ముంబై లోనే మకాం పెట్టిన విషయం తెలిసే ఉంటుంది. రీసెంట్ గా అయితే త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ సినిమా కోసం సంగీత ద్వయం విశాల్ అండ్ శేఖర్ తో కూర్చుని బన్నీ దగ్గరుండి మరీ ట్యూన్లు కంపోజ్ చేయించుకుంటున్నాడని టాక్ కూడా వచ్చింది. ఇక ఇప్పుడేమో ఏకంగా వైఫ్ స్నేహా రెడ్డి తో కలిసి అక్కడే చక్కర్లు కొడుతున్నాడని తెలియడం విశేషం. అంతా బాగానే ఉన్నా.. తాజాగా ముంబైలోనే ఉన్న బన్నీ అక్కడే బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న గోల్ మాల్ రిటర్న్స్ షూటింగ్ స్పాట్ లో మెరవడం మాత్రం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
దీంతో ఉన్నట్టుండి ముంబైలో చక్కర్లు, బీటౌన్ సెలబ్రిటీలతో బంధాలు ఏంటనే డౌట్ కలగడం సహజం. ఈ నేపథ్యంలో అసలు విషయం ఏంటని ఆరా తీస్తే, ఈ గోల్ మాల్ వెనుక పెద్ద కథే ఉందని ఇన్నర్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. ఆ స్టోరీలోకి వెళితే, బన్నీ ముంబైలో ప్రస్తుతం అక్కడున్న టాప్ యాడ్ ఏజెన్సీలు మరియు బ్రాండింగ్ కంపెనీలతో డిస్కషన్స్ చేస్తున్నాడట.  అంతేకాకుండా మొన్నటివరకు రామ్ చరణ్ ప్రొఫైల్ ను హ్యాండిల్ చేసిన పీఆర్ ఏజెన్సీతో చర్చలు కూడా జరుపుతున్నాడని తెలుస్తోంది.
మొత్తంగా ఇప్పుడు కొత్త పాత బ్రాండ్ లకు మళ్ళీ అంబాసిడర్ గా సంతకాలు పెట్టేసి.. ఏడాదికి మూడు బ్రాండ్లు, పది యాడ్లు అనేలా పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడని అంటున్నారు. అలాగే ఈ మొత్తం వ్యవహారాలను తనే స్వయంగా చూసుకోవాలని భార్యతో కలిసి ముంబై క్యాంపు పేరు చెప్పి అక్కడ హల్ చల్ చేస్తున్నాడని చెబుతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా అక్కడ ఓ పోష్ బార్ అండ్ రెస్టారెంట్ కు తన భార్యతో కలిసి బన్నీ డిన్నర్ కు కూడా వెళ్లాడని సమాచారం. ఇక ఈ మొత్తం స్టైలిష్ యవ్వారంతో ఇప్పుడు బీటౌన్ మీడియా కూడా మన అల్లువారబ్బాయి చురుకుదనం, మార్కెట్ తెలివితేటలు గురించి బాగానే స్టడీ చేస్తుందని న్యూస్ చక్కర్లు కొట్టేస్తోంది.