`ట్యాక్సీవాలా`కు బ‌న్ని అతిధి

Last Updated on by

సెంటిమెంటు ప‌రిశ్ర‌మ‌లో కొన్ని సెంటిమెంట్లు త‌ప్ప‌నిస‌రి అయిపోయాయి. హిట్టొస్తే ఆ సెంటిమెంటు ఇంకా బ‌ల‌ప‌డుతుంది. స‌రిగ్గా అలాంటి సెంటిమెంటే ఇది. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన గీత‌గోవిందం చాలా త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి 100కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. ఒక అప్‌క‌మ్ హీరో .. నాలుగు సినిమాల కిడ్ 100కోట్ల క్ల‌బ్ అందుకోవ‌డ‌మా? అంటూ అంద‌రూ నోరెళ్ల‌బెట్టారు. ఆ సినిమా ఇచ్చిన కిక్కు లోంచి ఇంకా గీతా ఆర్ట్స్ కానీ, దేవ‌ర‌కొండ కానీ బ‌య‌ట‌కు రాలేదంటే అతిశ‌యోక్తి కాదు.

అయితే అదే కిక్కు మ‌ళ్లీ మ‌ళ్లీ అనుభవించాల‌ని ఆశ‌గా ఎదురు చూస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్ర‌స్తుతం అత‌డు `ట్యాక్సీవాలా` రిలీజ్ ప‌నిలో ఉన్నాడు. ఓవైపు సామాజిక మాధ్య‌మాల్లో ఈ సినిమాపై ఆస‌క్తిక‌ర డిబేట్ ర‌న్ అవుతోంది. ఇదివ‌ర‌కూ ఇంట‌ర్నెట్‌లో లీకై చూసేసిన సినిమాని మ‌ళ్లీ చూస్తామా? అంటూ కొంద‌రు ట్వీట్లు చేయ‌డం ఇటీవ‌ల చ‌ర్చ‌కొచ్చింది. అయినా దేవ‌ర‌కొండ మాత్రం ట్యాక్సీవాలా స‌క్సెస్ పై ధీమాగా ఉన్నాడు. ఈ సినిమా మినీ బాహుబ‌లి… ఇందులో సీజీ వ‌ర్క్‌, గ్రాఫిక్స్ ఆ స్థాయిలో ఉంటాయి అంటూ ప్ర‌చారం చేస్తున్నాడు. ప్రమోష‌న్స్‌ విష‌యంలో ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేదు. ఈనెల 17న ట్యాక్సీవాలా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. 11న హైద‌రాబాద్‌లో భారీగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేశారు. ఈ వేడుక‌కు అల్లు అర్జున్ స్పెష‌ల్ గెస్ట్ గా విచ్చేస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే బ‌న్నిని అతిధిగా పిల‌వ‌డానికి కార‌ణం దేవ‌ర‌కొండ సెంటిమెంటేన‌ట‌. బ‌న్ని ప్రీరిలీజ్‌కి వ‌చ్చిన `గీత గోవిందం` పెద్ద హిట్ట‌యింది. ఇప్పుడు ట్యాక్సీవాలా అంతే పెద్ద హిట్ట‌వుతుంద‌ని న‌మ్ముతున్నాడ‌ట‌. యువి క్రియేష‌న్స్- జీఏ2 సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ట్యాక్సీవాలా రిలీజ్‌కి ఒక‌రోజు ముందు అంటే న‌వంబ‌ర్ 16న మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` రిలీజ్‌కి రెడీ అవుతోంది. నోటా లాంటి ఫ్లాప్ త‌ర్వాత దేవ‌ర‌కొండ‌కు ట్యాక్సీవాలా హిట్టు ఇంపార్టెంట్‌. అలానే ర‌వితేజ, శ్రీ‌నువైట్ల బృందానికి అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని విజ‌యం ఇంకా ఇంపార్టెంట్. కాబ‌ట్టి ఈ రెండు సినిమాల టిక్కెట్ విండో వ‌ద్ద‌ వార్ ఎలా న‌డుస్తుందో చూడాలి.

User Comments