మ్యాగ్జిమమ్ విప్ప‌కుండా చూపించాడు

Last Updated on by

మ్యాగ్జిమ్ అంటేనే విప్పి చూపించ‌డం అని అర్థం. మ్యాగ్జిమ‌మ్ ఇక్క‌డ అందాలే అంద‌రికీ కావాలి. అందుకే మ్యాగ్జిమ్ ఫోటోషూట్ వ‌స్తుందంటే చాలు.. అంతా క‌ళ్ల‌ప్ప‌గించుకుని చూస్తారు. కానీ అల్లుఅర్జున్ మాత్రం ఈ రూల్ బ్రేక్ చేసాడు. అమ్మాయిలైతేనే చూపించాలా.. ఈ మ‌ధ్య అబ్బాయిలు కూడా బాగానే చూపిస్తున్నారు. బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాంటి వాళ్లైతే ఏకంగా హీరోయిన్ల‌కు పోటీగా విప్పేస్తున్నారు. అయితే బ‌న్నీ బాబు మాత్రం బాగా ప‌ద్ద‌తిగా క‌నిపించాడు. మ్యాగ్జిమ్ క‌వ‌ర్ పేజీపై మెరిసిన బ‌న్నీ.. సింపుల్ గా బ్లాక్ సూట్ లో క‌నిపించాడు.

మ్యాగ్జిమ్ స్టీడ్ మ్యాగజైన్ క‌వ‌ర్ పేజీపై ఇలా మెర‌వ‌డం బ‌న్నీకి ఇదే తొలిసారి. ఇప్పుడు మ‌నోడి పేరు బాలీవుడ్ లోనూ మార్మోగిపోతుంది. దానికి కార‌ణం డ‌బ్బింగ్ వ‌ర్ష‌న్స్. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి నుంచే ముంబైలో బ‌న్నీ పేరు ఊగిపోతుంది. స‌రైనోడు.. డిజే లాంటి సినిమాలు కూడా యుట్యూబ్ లో 100 మిలియ‌న్ వ్యూస్ అందుకున్నాయి. దాంతో ఇప్పుడు అల్లుఅర్జున్ అంటే బాలీవుడ్ లోనూ హాట్ కేకే. ఈ క్రేజ్ తోనే మ్యాగ్జిమ్ స్టీడ్ క‌వ‌ర్ పేజీపై సోలోగా పోజిచ్చాడు బ‌న్నీ. కానీ ఇదివ‌ర‌క‌టి రూల్స్ బ్రేక్ చేస్తూ చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించాడు. ష‌ర్ట్ లెస్ పోజులు ఇవ్వ‌డాలు.. షార్ట్స్ వేసుకోవడాలు కాకుండా ప‌క్కా జెంటిల్ మ‌న్ త‌ర‌హాలో మారిపోయాడు అల్లు వార‌బ్బాయి.

User Comments