అల్లు అర్జున్ యాక్షన్ రెడీ

Last Updated on by

అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాకు క‌ష్ట‌ప‌డ‌నంత క‌ష్ట‌ప‌డుతున్నాడు నా పేరు సూర్య కోసం. వ‌క్కంతం వంశీ ఏ క‌థ చెప్పి ప‌డేసాడో కానీ ప్రాణం పెట్టేస్తున్నాడు అల్లు అర్జున్. ఏం కావాలంటే అది కాద‌న‌కుండా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ నిన్న‌టి వ‌ర‌కు శ్రీ‌న‌గ‌ర్ లో జ‌రిగింది. అక్క‌డే మైన‌స్ 12 డిగ్రీల గ‌డ్డ‌క‌ట్టే ఓ పాట చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు. నిజ‌మైన సైనిక ద‌ళాలు యుద్ధం చేసే స్థలాలు.. స్థావ‌రాల్లోనే నా పేరు సూర్య షూటింగ్ జ‌రిపాడు వంశీ. దానికోసం కావాల్సిన ప‌ర్మిష‌న్స్ అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాడు వ‌క్కంతం. దానికి ముందు డార్జిలింగ్ లో అనుకున్న షెడ్యూల్ కాస్తా ప‌శ్చిమ బెంగాల్ మమ‌తా బెన‌ర్జీ టూర్ తో క్యాన్సిల్ అయింది. దాంతో అదే శ్రీ‌న‌గ‌ర్ కు షిఫ్ట్ అయింది.

ఇక ఇప్పుడు హైద‌రాబాద్ లో భారీ క్లైమాక్స్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. శంషాబాద్ లో ఫిబ్ర‌వ‌రి 12 నుంచి 15 వ‌ర‌కు క్లైమాక్స్ షెడ్యూల్ జ‌ర‌గ‌బోతుంది. ఈ షెడ్యూల్ లో మీడియా కీల‌క‌పాత్ర పోషించ‌నుంది. నా పేరు సూర్య ఖచ్చితంగా అల్లు అర్జున్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోతుందంటున్నాడు బ‌న్నీవాస్. వ‌క్కంతం వంశీ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారుతున్నాడు. ఇందులో కోపం ఎక్కువ‌గా ఉండే సైనికుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు బ‌న్నీ. ఇది ఆంటోనీ ఫిష‌ర్ అనే హాలీవుడ్ సినిమాకు ఫ్రీమేక్ అనే వార్త‌లు వ‌స్తున్నాయి కానీ చిత్ర యూనిట్ మాత్రం ఇందులో నిజం లేద‌ని తేల్చేసింది. మ‌రి.. ఏప్రిల్ 27న రానున్న నా పేరు సూర్య ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర‌తీస్తాడో..?

User Comments