మిక్స్డ్ టాక్ తో నా పేరు సూర్య క‌లెక్ష‌న్స్

Last Updated on by

అల్లు అర్జున్ ఇమేజ్ ఇప్పుడు ఓ రేంజ్ లో ఉంది. ఈ హీరోకు కొన్నేళ్ల నుంచి సుడి బాగానే ఉంది. టాక్ తో కూడా ప‌ని లేకుండా కొన్ని సినిమాలు వ‌సూళ్లు కుమ్మేసాయి. గ‌తేడాది డిజే కూడా దీనికి మిన‌హాయింపు కాదు. యావ‌రేజ్ టాక్ తోనే సినిమా 70 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇకిప్పుడు నా పేరు సూర్య వ‌చ్చింది. ఈ చిత్రానికి తొలిరోజు వ‌సూళ్ళు బాగానే వ‌చ్చాయి. కానీ అద్భుతం అనేంత మాత్రం కాదు. తొలిరోజు 28 కోట్ల‌కు పైగా గ్రాస్.. 20 కోట్ల షేర్ తీసుకొచ్చాడు అల్లుఅర్జున్. స్పైడ‌ర్ కంటే కాస్త ఎక్కువ‌గా తీసుకొచ్చాడు సూర్య‌. తెలుగు రాష్ట్రాల్లో 16.20 కోట్ల షేర్ వ‌చ్చింది. ఇక మిగిలిన చోట్ల కూడా ప‌ర్లేద‌నే ఓపెనింగ్ తీసుకొచ్చాడు బ‌న్నీ. తొలి మూడు రోజులు వ‌సూళ్లు బాగానే ఉంటాయి. కానీ ఆ త‌ర్వాత కూడా నిలబ‌డుతుందా అనేది ఇప్పుడు అంద‌రిలోనూ ఆస‌క్తి. సినిమా సేఫ్ అవ్వాలంటే 82 కోట్లు రావాలి. అవి లేక‌పోతే సినిమా అంతే సంగ‌తులు. మ‌రి ఈ టాక్ తో సూర్య‌ను బ‌న్నీ ఎంత దూరం లాక్కెళ్తాడో..?

User Comments