నా పేరు సూర్య అక్క‌డ కూడా ఫ్లాపే

Last Updated on by

అల్లుఅర్జున్ సినిమా అంటే తెలుగుతో పాటు మ‌రో భాష‌లో కూడా అంచ‌నాలు అదే విధంగా ఉంటాయి. ఇక్క‌డ మాదిరే అక్క‌డ కూడా క‌లెక్ష‌న్ల సునామీ వ‌స్తుంది. అదే మ‌ళ‌యాలం.. కేర‌ళ‌లో ఆ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంజాయ్ చేస్తున్నాడు బ‌న్నీ. అక్క‌డి అభిమానులు ఈయ‌న్ని ముద్దుగా మ‌ల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. కెరీర్ లో తొలిసారి తెలుగు, మళ‌యాలంలో ఒకేసారి బ‌న్నీ సినిమా విడుద‌లైంది. అదే నా పేరు సూర్య‌. తెలుగులో సూర్య ఇప్ప‌టికే చ‌ల్ల‌బ‌డ్డాడు.. ఫ్లాప్ కు ద‌గ్గ‌ర‌గా ఉన్నాడు. అయితే అది డిజాస్ట‌రా ఫ్లాపా అనేది మాత్రం మ‌రో వారంలో తేలిపోతుంది.

ఇక మ‌ళ‌యాలంలోనూ ఈ చిత్రం ఫ్లాప్ అయింది. ఇక్క‌డ ఫ్లాప్ అయినా బ‌ద్రీనాథ్, ఇద్ద‌ర‌మ్మాయిలతో లాంటి సినిమాలు కూడా కేర‌ళ‌లో దుమ్ము రేపాయి. కానీ ఈ సారి మాత్రం రెండుచోట్లా బ‌న్నీకి భారీ దెబ్బ త‌ప్ప‌లేదు. అక్క‌డ ఫుల్ ర‌న్ లో క‌నీసం 2 కోట్ల మార్క్ కూడా దాట‌లేదు. 3 కోట్ల వ‌ర‌కు ఈ చిత్రాన్ని కొన్నారు. కానీ ఆ క‌లెక్ష‌న్లు రావ‌డం ఇప్పుడు గ‌గ‌నం అయిపోయింది. మొత్తానికి ఇంటా బ‌య‌టా.. ఓవ‌ర్సీస్ లో కూడా నా పేరు సూర్య‌కు చుక్క‌లు త‌ప్ప‌లేదు.

User Comments