బ‌న్నీకి షాక్ ఇచ్చిన ముఖ్య‌మంత్రి

Last Updated on by

అవునా.. పోయి పోయి రాజ‌కీయ నాయ‌కుల‌తో బ‌న్నీ ఎందుకు పెట్టుకున్నాడు అనుకుంటున్నారా..? ఆయ‌నేం పెట్టుకోలేదు కానీ వాళ్లే కావాల‌ని బ‌న్నీకి షాకిచ్చారు. ఇంత‌కీ ఎవ‌రా సిఎం అనుకుంటున్నారా..? ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌త బెనర్జీ ఇప్పుడు మ‌న బ‌న్నీ సినిమాకు అడ్డు ప‌డింది. దానికి కూడా కార‌ణం ఉంది. ఈయ‌న న‌టిస్తున్న నా పేరు సూర్య షూటింగ్ ప్ర‌స్తుతం డార్జిలింగ్ లో జ‌రుగుతుంది. అక్క‌డే మైన‌స్ 12 డిగ్రీల సెన్సియ‌స్ ద‌గ్గ‌ర క‌ష్ట‌ప‌డి షూటింగ్ చేసుకుంటున్నారు నా పేరు సూర్య యూనిట్. మ‌రికొన్ని రోజులు కూడా అక్క‌డే షూట్ ప్లాన్ చేసాడు ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీ. నిజ‌మైన సైనికులు ఉండే ప‌రిస్థితుల్లోనే ఈ షూటింగ్ చేస్తున్నాడు వంశీ. రియాలిటీకి ద‌గ్గ‌రగా ఉండాల‌నే ఈ ప్ర‌య‌త్నం అంతా అంటున్నాడు ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే రిప‌బ్లిక్ డే కానుక‌గా విడుద‌లైన సైనికా పాట‌కు రెస్పాన్స్ అదిరిపోయింది. నిజంగానే సైనికుల‌కు ఇది నిజ‌మైన నివాళిలా అనిపిస్తుంది. ముఖ్యంగా అకేష‌న్స్ ను భ‌లే క్యాష్ చేసుకుంటున్నారు నా పేరు సూర్య యూనిట్. రిప‌బ్లిక్ డేకు సైనిక పాట‌తో వ‌స్తే.. ఫిబ్ర‌వరి 14న వాలెంటైన్స్ డే కానుక‌గా ఈ చిత్రంలోని రెండో పాట విడుదల కానుంది.

అంతా స‌వ్యంగా సాగిపోతున్న టైమ్ లో వెస్ట్ బెంగాల్ పోలీసుల నుంచి డార్జిలింగ్ షెడ్యూల్ కు ప‌ర్మిష‌న్ రాలేదు. దానికి కార‌ణం నా పేరు సూర్య షూటింగ్ జ‌రుగుతున్న ప్ర‌దేశాల్లోనే మ‌మ‌త బెన‌ర్జీ టూర్ ఉండ‌టం. దాంతో షూటింగ్ కు అనుమ‌తి నిరాక‌రించారు పోలీసులు. దాంతో చేసేదేం లేక ఇదే షెడ్యూల్ ను ఇప్పుడు కాశ్మీర్ కు షిఫ్ట్ చేస్తున్నారు. అక్క‌డ కూడా సేమ్ కండీష‌న్స్ ఉంటాయి కాబ‌ట్టి అక్క‌డే పాట చిత్రీక‌ర‌ణ పూర్తి చేయ‌బోతున్నామ‌ని నిర్మాత బ‌న్నీ వాస్ తెలిపాడు. ఈ చిత్రం క‌చ్చితంగా అల్లు అర్జున్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోతుందంటున్నాడు బ‌న్నీవాస్. ఆరెంజ్ ఫ్లాప్ త‌ర్వాత మ‌ళ్లీ నిర్మాణం జోలికి రాని నాగ‌బాబు ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా ఉన్నాడు. వ‌క్కంతం వంశీ నా పేరు సూర్య‌తో ద‌ర్శ‌కుడిగా మారుతున్నాడు. ఎక్స్ ట్రీమ్ కండీష‌న్స్ లోనూ షూటింగ్ చేస్తోన్న బ‌న్నీ ప‌డుతున్న క‌ష్టానికి ఫ‌లితం ఎలా రాబోతుందో ఏప్రిల్ 27న తేల‌నుంది.

User Comments