బ‌న్నీ నెక్ట్స్ సినిమా 100 కోట్లు

Last Updated on by

కొన్ని రోజులుగా బ‌న్నీని ఒక‌టే ప్ర‌శ్న మ‌ళ్లీ మ‌ళ్లీ అడుగుతూనే ఉన్నారు. అదే నెక్ట్స్ ఏంటి..? ఈ మ‌ధ్య కాలంలో ఇన్ని రోజులు ఏ సినిమా కోసం తీసుకోలేదు ఈ హీరో. వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే చాలా ఏళ్ళ త‌ర్వాత త‌గిలిన షాక్ క‌దా.. కోలుకోడానికి కాస్త టైమ్ ప‌డుతుంది. అది స‌హ‌జ‌మే. అందుకే నా పేరు సూర్య వ‌చ్చి రెండు నెల‌లైనా ఇప్ప‌టికీ త‌ర్వాతి సినిమాపై ఏమీ చెప్ప‌లేదు బ‌న్నీ. అయితే ఇప్పుడు ఈ స‌స్పెన్స్ డ్రామాకు ఎండ్ కార్డ్ ప‌డిన‌ట్లే తెలుస్తుంది. బ‌న్నీ నెక్ట్స్ సినిమా విక్ర‌మ్ కే కుమార్ తో ఉండ‌బోతుంది. ఆ మ‌ధ్య సెకండాఫ్ లో ఏదో అనుమానాలు ఉన్నాయి అని అడిగాడు బ‌న్నీ.. అది ఇప్పుడు క్లియ‌ర్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. దాంతో ఈ చిత్రం ఇక ప‌ట్టాలెక్క‌డ‌మే త‌రువాయి. బ‌న్నీతో రేసుగుర్రం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ నిర్మించిన న‌ల్ల‌మ‌లుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు.

దాదాపు 100 కోట్ల‌తో ఈ సినిమా ఉండ‌బోతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక విక్ర‌మ్ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ కూడా లైన్ లో ఉంది. వ‌ర‌స సినిమాల‌తో ర‌చ్చ చేస్తున్న డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్ర‌స్తుతం అర‌వింద స‌మేత తెర‌కెక్కిస్తోన్న మాట‌ల మాంత్రికుడు.. ఆ త‌ర్వాత వెంక‌టేశ్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ రెండు పూర్తైన త‌ర్వాత బ‌న్నీతో సినిమా ప‌ట్టాలెక్కించ‌నున్నాడు త్రివిక్ర‌మ్. ఇప్ప‌టికే ఈ కాంబినేష‌న్ లో జులాయి.. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలు వ‌చ్చాయి. ఇక డివివి దాన‌య్య‌తో కూడా దేశ‌ముదురు లాంటి సినిమాలు చేసాడు అల్లుఅర్జున్. మొత్తానికి ఇన్ని రోజులు స‌స్పెన్స్ లో పెట్టినా ఒకేసారి విక్రమ్ కే కుమార్.. త్రివిక్ర‌మ్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు ఓకే చేసి ఫ్యాన్స్ ను ఖుషీలో ముంచేస్తున్నాడు బ‌న్నీ.

User Comments