బ‌న్నీ మెగా ఫ్యామిలీ కాదా..?

ఏమో.. ఇప్పుడు ఈ ఫోటో చూస్తుంటే ఇదే అనుమానం వ‌స్తుంది. కొంత‌కాలంగా మెగా కుటుంబంతో అల్లుఅర్జున్ కు వివాదాలు న‌డుస్తూనే ఉన్నాయి అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో బ‌న్నీ ప్ర‌వ‌ర్తించిన తీరు మెగాస్టార్ నుంచి అంద‌ర్నీ కాస్త బాధ పెట్టింద‌ని తెలుస్తుంది. ఇక కుర్ర హీరోలైతే బ‌న్నీని కాస్త దూరంగానే ఉంచుతున్నార‌ని.. దాని ఫ‌లిత‌మే ఇప్పుడు ఈ బ్యాన‌ర్ అని తెలుస్తుంది. వ‌రుణ్ తేజ్ న‌టించిన తొలిప్రేమ ఆడియో వేడుక కార్య‌క్ర‌మంలో పెట్టిన వెల్ క‌మ్ బ్యానర్ ఇది. ఈ ఫోటోస్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్.. చిరంజీవి.. చ‌ర‌ణ్.. నాగ‌బాబు ఉన్నారు. కానీ ఎప్పుడూ మెగా వేడుక‌ల్లో క‌నిపించే బ‌న్నీ బొమ్మ ఈ సారి క‌నిపించ‌లేదు. ఇందులో బ‌న్నీ ఫోటో అనుకోకుండా మిస్ అయిందో.. లేదంటే కావాల‌నే మిస్ చేసాడో అర్థం కావ‌డం లేదు. అలా మిస్ చేసాడ‌నుకుంటే తొలిప్రేమ ఆడియో లాంఛ్ కు అల్లు అర‌వింద్ ముఖ్య అతిథిగా వ‌చ్చాడు. మ‌రి అనుకోకుండా మ‌రిచిపోయార‌నే అనుకోవాలా.. లేదంటే మెగా ఫ్యామిలీ వేరు.. అల్లు కుటుంబం వేరు అని వ‌రుణ్ తేజ్ ఫీల్ అయ్యాడా..? ఏదేమైనా ఇప్పుడు బ‌న్నీ ఫోటో అక్క‌డ లేక‌పోవ‌డం మాత్రం అభిమానుల‌కు లేని పోని అనుమానాలు వ‌చ్చేలా చేస్తున్నాయి. ఈ విష‌యంలో బ‌న్నీ అభిమానులు కూడా కాస్త కినుక వ‌హించార‌ని తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక‌.. బ‌న్నీతో మెగా వార్ ఎలా ముగియ‌నుందో..?