బ‌న్నీ నోట భ‌ర‌త్ మాట‌

Last Updated on by

ఇప్పుడు మ‌న హీరోలంతా మారిపోయారు. ఒక‌రంటే ఒక‌రు తెగ ప్రేమ‌లు కురిపించేసుకుంటున్నారు. అస‌లు ఇన్నాళ్లూ మ‌నం చూసిన ఇండ‌స్ట్రీకి ఇప్పుడు మ‌నం చూస్తున్న ఇండ‌స్ట్రీకి చాలా తేడాలు ఉన్నాయి. ఒక‌ప్పుడు సినిమాలు హిట్టైనా లోలోప‌లే అంతా ప్ర‌శంస‌లు కురిపించుకునేవాళ్లు.  హీరోలు ఎంత బాగున్నా కూడా బ‌య‌ట అభిమానుల‌కు అది తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు.. మేమంతా ఒక్క‌టే అని ప‌దేప‌దే చెప్తూ ప్రేక్ష‌కుల‌కు కూడా సందేశాన్ని పంపిస్తున్నారు హీరోలు. ఇప్పుడు నా పేరు సూర్య ఈవెంట్ లో కూడా ఇదే జ‌రిగింది. రామ్ చ‌ర‌ణ్ కు స‌భాముఖంగా కంగ్రాట్స్ చెప్పాడు బ‌న్నీ. ఇండ‌స్ట్రీ స్లంప్ లో ఉన్న‌పుడు రంగ‌స్థ‌లం వ‌చ్చి అలా పైకి లేపింద‌ని.. అందుకు చ‌ర‌ణ్ కు ధ‌న్య‌వాదాలు అన్నాడు బ‌న్నీ.

దాంతో పాటు ఆ సినిమా త‌ర్వాత వ‌చ్చిన భ‌ర‌త్ అనే నేను కూడా బాగా ఆడుతుంద‌ని.. దానికి మ‌హేష్ గారు అండ్ కొర‌టాల శివ‌కు కూడా కంగ్రాట్స్ అని చెప్పాడు అల్లు అర్జున్. త‌న సినిమా కూడా బాగా ఆడాలని.. ఈ సినిమాతో హ్యాట్రిక్ పూర్తి అవుతుంద‌ని భావిస్తున్న‌ట్లు తెలిపాడు బ‌న్నీ. ఈ హీరో మాట‌లు చూస్తుంటే ఈయ‌న‌లో వ‌చ్చిన మార్పు తెలుస్తుంది. ఒక‌ప్పుడు త‌న సినిమాల గురించి త‌ప్ప ప‌క్క సినిమాల గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోని బ‌న్నీ.. ఇప్పుడు అంద‌రి గురించి చెప్పేస్తున్నాడు. ఈ మార్పే క‌దా ఇన్నాళ్లూ అభిమానులు కూడా కోరుకున్న‌ది. అన్న‌ట్లు మెగా కుటుంబంతోనూ బ‌న్నీ చాలా బాగా క‌లిసిపోయాడు. మొన్న‌టి వ‌ర‌కు ఎలా ఉండేదో తెలియ‌దు కానీ ఇప్పుడైతే చ‌ర‌ణ్ నా త‌మ్ముడు అంటూ ద‌గ్గ‌రికి తీసుకుంటున్నాడు అల్లు వారబ్బాయి.

User Comments