బన్నీకి మనం వద్దు.. కేరళ ముద్దు

బన్నీ పైకి అమాయ‌కంగా క‌నిపిస్తాడు కానీ లోప‌ల మాత్రం పెద్ద దేశ‌ముదురు అల్లుఅర్జున్. ఈయ‌న చేసే ప్ర‌తీ ప‌ని వెన‌క త‌న కెరీర్ కు మంచి పునాది వేసుకుంటాడు అల్లు వార‌బ్బాయి. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. త‌న కెరీర్ కోసం ఓ అమ్మాయిని వాడేసుకుంటున్నాడు. ఆమె క్రేజ్ ను త‌న కెరీర్ కోసం యూజ్ చేసుకుంటున్నాడు బ‌న్నీ. ఇంత‌కీ ఎవ‌రా అమ్మాయి అనుకుంటున్నారా..? ప‌్రియా ప్రకాష్ వారియ‌ర్.. ఈ పేరు రెండు రోజులుగా ఇంట‌ర్నెట్ లో ఓ సంచ‌ల‌నంగా మారిపోయింది. అస‌లు ఈమె ఇచ్చిన ఎక్స్ ప్రెష‌న్స్ ప్ర‌పంచంలో ఇంకే అమ్మాయికి సాధ్యం కాదు.. అన్నంత రేంజ్ లో ప్ర‌మోట్ చేస్తున్నారు. ఎందుకు ఇంత‌గా ఈ భామ‌ను ప్ర‌మోట్ చేస్తున్నారో తెలియ‌దు కానీ సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ప్రియా ఓ హాట్ కేక్.

Allu Arjun Promoting Priya Prakash Varrieir For Kerala Fans

ప్రియా ఒక్క దెబ్బ‌తో సోష‌ల్ మీడియాలో క్వీన్ అయిపోయింది. పైగా ఈమె మలయాళీ అమ్మాయి కావడం తో అల్లు అర్జున్ ట్విట్ట‌ర్ లో ఈమె వీడియోను షేర్ చేసాడు.దాని వ‌ల్ల అల్లు అర్జున్ కి యూజ్ ఏంటి అనుకొంటున్నారా? మ‌నోడికి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఇలా అక్క‌డ క్రేజ్ ఉన్న అమ్మాయిని పొగిడితే ఆటోమేటిక్ గా మ‌రింత ఇమేజ్ వ‌స్తుందక్క‌డ‌. అందుకే ఓ అమ్మాయి క్రేజ్ ను త‌న కోసం వాడేసుకుంటున్నాడు బ‌న్నీ. పొరుగింటి పుల్ల కూర రుచి కదా. తెలుగు వారిని పొగిడితే కిరీటం కిందపడుద్ది కదా అందుకే ఎక్కడో ఉన్న వాళ్ళని నెత్తి మీద పెట్టుకొంటారు మన హీరోలు. ఇందులో బన్నీ చాలా దిట్ట. ప్రియా వారియ‌ర్ పుణ్య‌మా అని బ‌న్నీ క్రేజ్ కేరళ‌లో మ‌రింత పెర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మొత్తానికి ఇప్పుడు చెప్పండి.. బ‌న్నీ నిజంగానే దేశ‌ముదురు క‌దా..!

User Comments