హ‌రీష్ కు బ‌న్నీ గిఫ్ట్.. ఇప్పుడెందుకో..?

Last Updated on by

ఈ మ‌ధ్య హీరోలు త‌మ‌కు న‌చ్చిన సినిమాలు చేసిన ద‌ర్శ‌కుల‌కు గిఫ్టులు ఇవ్వ‌డం ఆన‌వాయితీగా మారింది. విడుద‌లైన రెండు మూడు వారాల త‌ర్వాతో.. లేదంటే కొన్ని రోజుల త‌ర్వాత ఇస్తే ఓ ప‌ద్ద‌తి. అప్ప‌ట్లో ఎన్టీఆర్.. మ‌హేశ్ లాంటి హీరోలు కూడా కొర‌టాల శివ‌కు త‌మ బ‌హుమ‌తులు ఇలాగే ఇచ్చారు. అయితే ఇప్పుడు అల్లుఅర్జున్ మాత్రం అంద‌రికీ షాకిచ్చాడు. సినిమా విడుద‌లైన ఏడాది త‌ర్వాత త‌న ద‌ర్శ‌కుడికి గిఫ్ట్ పంపించాడు బ‌న్నీ. అది కూడా యావ‌రేజ్ సినిమా తీసిన ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కు. 2017లో డిజేతో ఈ ఇద్ద‌రూ క‌లిసారు. ఈ చిత్రం యావ‌రేజ్ అయినా వ‌సూళ్లు మాత్రం 70 కోట్ల‌కు పైగానే వ‌చ్చాయి.

Allu arjun sent a gift to director Harish shankar

క‌మ‌ర్షియ‌ల్ గా చాలా చోట్ల ఈ చిత్రం సేఫ్ అయింది. కాక‌పోతే మరీ ఎక్కువ రేట్ల‌కు అమ్మ‌డంతో డిజే అబౌ యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగి పోవాల్సి వ‌చ్చింది. అయితే ఇప్పుడేమైందో ఏమో కానీ స‌డ‌న్ గా హ‌రీష్ శంక‌ర్ కు ఓ గిఫ్ట్ పంపించాడు బ‌న్నీ. తన ట్విట్టర్ లో బ‌న్నీ పంపిన బహుమతి పోస్ట్ చేసి థ్యాంక్యూ అల్లు అర్జున్ ఫర్ ది స్వీట్ సర్ ప్రైజ్.. యూ మేడ్ మై డే అంటూ రాసుకొచ్చాడు. అయితే ఇందులో ఏం ఉందో మాత్రం చెప్ప‌లేదు ఈ ద‌ర్శ‌కుడు. కెమెరాతో పాటు ఓ ప‌ర్ ఫ్యూమ్ ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. మొత్తానికి ఇప్పుడు స‌డ‌న్ గా ఈ గిఫ్ట్ పంప‌డం వెన‌క ఉన్న మ‌త‌ల‌బేంటో ఈ ఇద్ద‌రికే తెలియాలి..!

User Comments