శిరీష్ కెరీర్ కు మిగిలింది ఒక్క క్ష‌ణం..

ఈ మ‌ధ్య తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌యోగాల‌కు కొద‌వే లేకుండా పోతుంది. ప్రేక్ష‌కులు చూస్తున్నారు క‌దా అని ద‌ర్శ‌కులు కూడా త‌మ బుర్ర‌ల‌కు ఇంకా ప‌దును పెడుతూనే ఉన్నారు. పైగా ఇన్నాళ్లూ మ‌న‌కు ఒక్క‌డే సుకుమార్ ఉన్నాడు. ఇప్పుడు ఆయ‌న‌కు తోడుగా మ‌రొక‌రు వ‌చ్చారు. అంటే అర్థం కాని సినిమాలు చేస్తాడ‌ని కాదు.. కాస్త కొత్త‌ద‌నం ఉన్న సినిమాలు చేస్తాడ‌ని. ఆయ‌నే విఐ ఆనంద్. టైగ‌ర్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అయ్యాడు ఈ ద‌ర్శ‌కుడు. ప‌రువు హ‌త్య‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఆ చిత్రానికి ప్ర‌శంస‌లు ద‌క్కాయి కానీ క‌మ‌ర్షియ‌ల్ గా విజ‌యం మాత్రం రాలేదు. కానీ నిఖిల్ ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడాతో క్రేజీ ద‌ర్శ‌కుడిగా మారిపోయాడు ఆనంద్. డీమానిటైజేష‌న్ త‌ట్టుకుని విజ‌యం సాధించిన తొలి సినిమా ఇదే.

ఆనంద్ ప్ర‌స్తుతం అల్లు శిరీష్ తో ఓ సినిమా చేస్తున్నాడు. సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింది. ఓ వైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉన్నారు చిత్ర‌యూనిట్. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో రాని కొత్త నేప‌థ్యంతో ఈ చిత్రం వ‌స్తుందంటున్నాడు ఆనంద్. దీనికి ఒక్క క్ష‌ణం అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. క‌థ కూడా అంతే ఆస‌క్తిగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఈ టైటిల్ బాగుంటుంద‌ని ఫీల్ అవుతున్నాడు ద‌ర్శ‌కుడు. ఈ చిత్ర షూటింగ్ బెంగ‌ళూర్ లో జ‌రుగుతుంది. ఆ సెట్ కు క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ వ‌చ్చాడు. ఈ మ‌ధ్యే పునీత్ అన్న‌య్య శివ‌రాజ్ కుమార్ న‌టించిన టగరు సినిమా ట్రైల‌ర్ ను శిరీష్ లాంచ్ చేసాడు. ఇప్పుడు త‌మ్ముడు శిరీష్ సెట్ కు వ‌చ్చాడు. మొత్తానికి ఈ ఒక్క క్ష‌ణం త‌న కెరీర్ ను మ‌లుపు తిప్పుతుంద‌ని న‌మ్మ‌కంతో ఉన్నాడు ఈ అల్లువార‌బ్బాయి.

Follow US