తెలుగు స్ట్రెయిట్ కథలు.. అనువాద కథలు .. ఇరుగు పొరుగు పరిశ్రమల్లో అవకాశాలు .. ఇవేవీ అల్లు శిరీష్ కెరీర్ కి ఏమాత్రం సహకరించలేదు. శ్రీరస్తు శుభమస్తు- కొత్త జంట లాంటి సినిమాలు మినహా వేరే సినిమాలేవీ విజయం అందుకోకపోవడం .. బావుంది అన్న సినిమా కూడా ఆడకపోవడం ఈ యంగ్ హీరో కెరీర్ పై ప్రభావం చూపించింది. మొత్తానికి శిరీష్ కెరీర్ ముగిసినట్టేనా? అన్న టాక్ నడుమ .. క్రిటిసిజానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక సైలెంటుగా ఉన్నాడు.
అయితే ఉన్నట్టుండి అతడు మెరుపు లేని ఉరుములా ఓ కొత్త కబురు చెప్పి షాకిచ్చాడు. 2020లో రెండు రిలీజ్ లు ఉంటాయ్! అన్నదే అతడి కబురు. అయితే ఇది నిజమా? శిరీష్ సైలెంటుగా ఎవరికీ తెలీకుండా రెండు సినిమాల్లో నటిస్తున్నాడా? అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ రెండు సినిమాలేవో చెప్పొచ్చు కదా! అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఓటీటీ వేదిక ద్వారా శిరీష్ కొత్త ట్యాలెంటుకు అవకాశం ఇస్తున్నాడని ప్రచారమవుతోంది. మరి సొంతంగా రెడీ చేస్తున్న వేదికపై తాను నటిస్తాడా లేదా? అన్నది తెలియాల్సి ఉంది.