మెగా హీరోకే సెల్ఫ్ ప్రమోషన్ తప్పట్లేదు

Last Updated on by

తెలుగు ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న డిమాండ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిందేముంది. అక్క‌డ్నుంచి ఎవ‌రొచ్చినా ఒక‌టి రెండు హిట్లు కొడితే చాలు ప్రేక్ష‌కులు నెత్తిన పెట్టుకుంటారు. నిర్మాత‌లు క్యూ క‌డ‌తారు. కానీ అల్లు శిరీష్ విష‌యంలో మాత్రం ఇది జ‌ర‌గ‌డం లేదు. ఆయ‌న కంటే త‌ర్వాత వ‌చ్చిన వ‌రుణ్ తేజ్ కూడా స్టార్ అయిపోయాడు కానీ శిరీష్ మాత్రం ఇప్ప‌టికీ ఉనికి కోసం పాటు ప‌డుతూనే ఉన్నాడు. త‌న‌కు ఎవ‌రి ప్ర‌మోష‌న్ అక్క‌ర్లేద‌ని.. త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకునే ప‌ని మొద‌లుపెట్టాడు ఈ హీరో.

ఈయన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో ఓ చైనీస్ సినిమా ప్రీమియ‌ర్ కు వెళ్లాడు. అక్క‌డ నుంచి త‌న ఫోటోలు వైర‌ల్ అయ్యేలా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ విష‌యంలో అల్లువారి చిన్న‌బ్బాయి చాలా తెలివైనోడు. అన్న స‌రైనోడు అయితే.. ఈ అబ్బాయి తెలివైనోడే. అందుకే చైనీస్ సినిమా ప్రీమియ‌ర్ తో భాగంగా త‌న ప్ర‌మోష‌న్ కూడా బాగా అయ్యేలా చూసుకున్నాడు. ఇవ‌న్నీ చూసి అబ్బో శిరీష్ ను చైనీస్ సినిమాల‌కు కూడా ఆహ్వానిస్తున్నారే అనుకుంటున్నారు ప్రేక్ష‌కులు. ప్ర‌స్తుతం ఈయ‌న ఖాళీగా ఉన్నాడు.

ఒక్క‌క్ష‌ణం ఫ్లాప్ త‌ర్వాత‌ శిరీష్ పూర్తిగా డ‌ల్ అయిపోయాడు. శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు తెచ్చిన పేరు కూడా ఒక్క‌క్ష‌ణం క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్ దెబ్బ‌తో క‌నుమ‌రుగు అయిపోయింది. దాంతో ఇప్పుడు మ‌ళ్లీ జ‌నాల దృష్టిలో ప‌డేలా త‌న‌కు త‌నుగా ప్ర‌మోష‌న్ చేసుకుంటున్నాడు ఈ హీరో. ఈ మధ్యే సూర్య, మోహన్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా అల్లు శిరీష్ కమిట్ అయ్యాడు.

User Comments